పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , First Publish Date - 2022-06-25T06:16:54+05:30 IST

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏజెన్సీ అదనపు జిల్లా వైద్యాధికారి కుడిమెత మనోహర్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని హనుమాన్‌ నగర్‌ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో వ్యాఽధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులకు అవగాహన కల్పించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
ఇంద్రవెల్లిలోని హనుమాన్‌ నగర్‌ కాలనీలో పరిసరాలను పరిశీలిస్తున్న వైధ్యాధికారి మనోహర్‌

ఏజెన్సీ అదనపు జిల్లా వైద్యాధికారి కుడిమెత మనోహర్‌

ఇంద్రవెల్లి, జూన్‌ 24: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏజెన్సీ అదనపు జిల్లా వైద్యాధికారి కుడిమెత మనోహర్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని హనుమాన్‌ నగర్‌ కాలనీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో వ్యాఽధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులకు అవగాహన కల్పించారు. అనంతరం వైద్యాధికారి మనోహర్‌ మాట్లాడుతూ ఆరోగ్యవంతంగా ఉండేందుకు గ్రామాల్లోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చెత్తను రోడ్లపై వేయకుండా తడి, పొడి చెత్తను వేరుచేయాలని సూచించారు. అదేవిధం గా ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలన్నారు. మల విసర్జన ఆరుబయట చేయడం ద్వారా వ్యాఽధులు ప్రబలి ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇళ్లల్లో నీరు బయటకు వెళ్లడం ద్వారా మురికి నీరు నిలువ ఉండి దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో అవగాహన కల్పించి పరిశుభ్రంగా ఉండేలా చూడాల న్నారు. ఇందులో మండల వైధ్యాధికారి డాక్టర్‌ శ్రీకాంత్‌, రాథోడ్‌ గోకుల్‌, సూపర్‌వైజర్‌ శ్రీనివాస్‌, వైద్యసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-25T06:16:54+05:30 IST