సర్వే సగమే!

ABN , First Publish Date - 2020-10-12T09:35:45+05:30 IST

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం చేపట్టిన ఇంటింటి సర్వే అంతంతమాత్రం గానే

సర్వే సగమే!

ఉమ్మడి జిల్లాలో నత్తనడకన సాగుతున్న వ్యవసాయేతర ఆస్తుల నమోదు సర్వే

నిర్దేశించిన గడువులోపు పూర్తికాని వైనం

గ్రామాల్లో 50 శాతం, మున్సిపాలిటీలలో 40 శాతం మాత్రమే

నిజామాబాద్‌ జిల్లాలోని 530 గ్రామ పంచాయతీల్లో 47 శాతం పూర్తి

కామారెడ్డి జిల్లాలో 526 జీపీలలో 38 శాతమే 

మరో పది రోజులు గడువు పొడిగింపు

20 వరకూ ఆస్తులు నమోదు చేసుకోవచ్చు


కామారెడ్డి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వ్యవసాయేతర ఆస్తుల నమోదు కోసం చేపట్టిన ఇంటింటి సర్వే అంతంతమాత్రం గానే సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఉభయ జిల్లాలో ఇప్పటివరకు సగం మాత్రమే సర్వే అయి నట్లు తెలుస్తోంది. పంచాయతీలలో 50 శాతం పూర్తికాగా.. మున్సిపాలిటీలలో 40 శాతం వరకు పూర్తయినట్లు తెలు స్తోంది. ఆస్తుల సమగ్ర సమాచారం సేకరణలో అవంతరా లు చోటు చేసుకోవడమే ఇందుకు కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సర్వర్‌ సతాయించడం, ఆన్‌లైన్‌ లో నమోదులో సాంకేతిక కారణాలు ఎదురువుతున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని గ్రామపంచాయతీల లో సర్వే సగమే అయింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో ప్రభుత్వం ఆస్తుల సర్వేకు మరో పది రోజుల పాటు గడువు పొడిగించింది. ఈనెల 20 వరకు ఆ స్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.


పంచాయతీల్లో 50.. పట్టణాల్లో 40 శాతం

నిజామాబాద్‌ జిల్లాలోని 27 మండలాలోగల 530 గ్రా మ పంచాయతీలలో 10 రోజుల నుంచి ఆస్తుల సర్వే చేప డుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 47 శాతం ఆస్తుల న మోదు ప్రక్రియపూర్తయినట్లు తెలుస్తోంది. 503 గ్రామపం చాయతీలలో సుమారు 1,16,236 ఆస్తులు ఉండగా ఇప్పటి వరకు 24,919 ఆస్తుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదుచే శారు. ఆయా గ్రామ పంచాయతీలలో సర్వే చేపట్టేందుకు 561 మంది ఉద్యోగులను ఏర్పాటుచేశారు. నిజామాబాద్‌ నగర పాలక సంస్థతో పాటు ఆర్మూర్‌, బోదన్‌, భీమ్‌గల్‌ మున్సిపాలిటీలలోనూ ఆస్తుల సర్వే అంతంతమాత్ర ంగానే సాగుతోంది. మున్సిపాలిటీలలో 40 శాతం మాత్రమే అయి నట్లు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లాలో 22 మండలాల్లోని 526 గ్రామపంచాయతీల పరిధిలో సూమారు 1,01,209 ఆ స్తులు ఉండగా.. ఇందులో 19,873 ఆస్తుల వివరాలను ఆన్‌ లైన్‌లో నమోదు చేశారు. అనగా గ్రామపంచాయతీల పరి ధిలో 38 శాతం ఆస్తుల నమోదు పూర్తిచేశారు. ఈ ఆస్తుల సర్వేకు గ్రామపంచాయతీ సిబ్బంది 544 మంది విదులు నిర్వహిస్తున్నారు.


అధికారులకు అవాంతరాలు

ఉభయ జిల్లాల్లో ఆస్తుల వివరాల సేకరణలో అధికారు లకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. వివరాలు చెబితే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలకు గండిపడుతుందేమోననే భయం ప్రజల్లో నెలకొంది. ప్రధానంగా గ్రామాల్లో ఆస్తుల వివరాలు చెప్పడానికి ఆసక్తి కనబరచడం లేదు. మరోవైపు వ్యవసాయ సీజన్‌ కావడంతో, రైతులు, కూలీలు, నిత్యం ప నులకు వెళ్తున్నారు. అదేవిధంగా బతుకు దెరువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు ఉండడం, వచ్చిన సరైన వివరాలు లేకపోవడంతో ఆన్‌లైన్‌ చేయడంలో ఆలస్యం అవుతున్నట్టు తె లుస్తోంది. సర్వేకు వెళ్లిన అధికారులు,సిబ్బందికి స్థానికంగా ఆన్‌లైన్‌ సర్వర్‌లు మొరాయించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వారు పేర్కోంటున్నారు. కోందరి ఆస్తుల వివరాలు రికార్డుల్లో లేకపోవడంతో ఆన్‌లైన్‌ చేసేందుకు వీలు కావడం లేదని మరికొందరివి డాక్యుమెంట్లు లేకపోవడం సమస్యగా మారుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.


మండలం జీపీల నమోదు చేయాల్సినవి సంఖ్య నమోదు చేసినవి

ఆర్మూర్‌ 18 4,750 1,312

ముప్కాల్‌ 7 2,829 461

మోర్తాడ్‌ 10 2,786 606

సిరికొండ 30 6,001 1,816

మోస్రా 5 1,275 295

డిచ్‌పల్లి 34 7,674    1,916

కమ్మర్‌పల్లి 14 3,321 778

బాల్కొండ 10 2,794 516

జక్రాన్‌పల్లి 21 6,067     1,083

చందూరు 5 869 247

ఇందల్వాయి 23 5,177 1,123

నందిపేట 33 7,063     1,568

రుద్రూరు 10 1,990 456

రెంజల్‌ 17 2,283 767

ధర్పల్లి 22 3,997 989

వర్ని 22 3,695 947

మాక్లూర్‌ 30 5,106 1,197

వేల్పూర్‌ 18 3,866 715

భీమ్‌గల్‌ 27 5,225     1,063

మోపాల్‌ 21 4957 820

మెండోర 11 2373 411

ఎడపల్లి 17 3078 532

నవీపేట 32 6376 981

బోధన్‌ 38 5729 1050

నిజామాబాద్‌ 19 3240 498

కోటగిరి 28 4100 594

ఏర్గట్ల 8 1529 159

Updated Date - 2020-10-12T09:35:45+05:30 IST