జగ్గయ్యపేట స్విమ్మర్ల ప్రతిభ

Published: Mon, 08 Aug 2022 00:24:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జగ్గయ్యపేట స్విమ్మర్ల ప్రతిభవిజేతలతో డ్రీమర్స్‌ అసోసియేషన్‌ కోచ్‌ పాండురంగారావు

వేర్వేరు విభాగాల్లో 16 పతకాలు

జగ్గయ్యపేట : హైదరాబాద్‌లో జరిగిన జాతీయస్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో జగ్గయ్యపేట డ్రీమర్స్‌ స్విమ్మర్స్‌ అసోసియేషన్‌ కోచ్‌, వ్యవస్థాపకుడు పాండురంగారావు నేతృత్వంలో పాల్గొన్న ఎనిమింది స్విమ్మర్లు 10 పసిడి పతకాలు, 4 రజిత, 2 కాంస్య పతకాలను సాధించారు. పి.లక్ష్మి 3, పి.రమాదేవి 3 స్వర్ణ పతకాలు సాధించారు. పాండురంగారావు రజిత, చిట్యేల మోహన రావు రెండు స్వర్ణ, ఒకటి రజిత,  షేక్‌ సలీం 2 స్వర్ణ, ఒక రజిత, రాయల సత్యనారాయణ ఒక స్వర్ణ, 2 కాంస్య పతకాలు సాధించారని కోచ్‌ పాండు రంగారావు తెలిపారు. ఈ సంద్భరంగా విజేతలను పలువురు అభినందించారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.