థమన్‌ని రీప్లేస్ చేసిన తమిళ సంగీత దర్శకుడు..?

Sep 2 2021 @ 08:50AM

ప్రస్తుతం సౌత్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలుగుతున్న ఎస్ ఎస్ థమన్ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నవన్నీ భారీ ప్రాజెక్ట్సే. దాంతో ఓ చిత్రబృందం ఆయనను ముందు తమ సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంచుకొని ఇప్పుడు ఆ ప్లేస్‌లో తమిళ సంగీత దర్శకుడిని తీసుకున్నారని తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని ఏజెంట్ అనే సినిమా చేస్తున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి ముందు థమన్‌ను సంగీత దర్శకుడుగా ఎంపిక చేశారు. కానీ ఆయన మెగాస్టార్, పవర్ స్టార్, రాం చరణ్, మహేశ్ బాబు సహా పలువురు స్టార్ హీరోల సినిమాలను కమిటయి ఆ ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉన్నారు. దాంతో ఆయనని కాదని ఇప్పుడు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళను ఎంచుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ రెడ్డి 2 సినిమా బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, దీపా రెడ్డి నిర్మిస్తున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.