ప్రజలపై పన్నుల భారం తగ్గించాలి : జూలకంటి

ABN , First Publish Date - 2021-02-27T05:56:58+05:30 IST

ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ప్రజలపై పన్నుల భారం తగ్గించాలి : జూలకంటి
చిట్యాల : విలేకరులతో మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి

చిట్యాల / నల్లగొండ రూరల్‌  / మిర్యాలగూడ, ఫిబ్రవరి 26 : ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చిట్యాలలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చమురు ధరలపై నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో నెలలో ఏడెనిమిది సార్లు ధరలు పెరుగుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏడేళ్లలో  పెట్రోల్‌ ధరలు 60శాతం, డీజిల్‌ ధరలు 56శాతం పెంచాయన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని కో రారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి నాయకు లు అయిలయ్య, జిట్ట నగేష్‌, అవిశెట్టి శంకరయ్య, శీలా రాజయ్య పాల్గొన్నారు.పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ కేంద్ర కమిటీ ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపులో భాగంగా జిల్లాకేంద్రంలోని పాత కలెక్టర్‌ కార్యాలయ గ్రౌండ్‌లో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భం గా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు వేముల రవి, కార్యదర్శి లింగస్వామి, షరీఫ్‌, జమాల్‌, షరీఫ్‌, నర్సింహ పాల్గొన్నారు. భారత్‌ బంద్‌లో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని లారీ యార్డులో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చాంద్‌పాష మాట్లాడుతూ పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వెంట నే తగ్గించాలన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ నాయకులు సిద్దగాని యాదయ్య, కె.వెంకటయ్య, రవీందర్‌రావు, బాలకృష్ణ, పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:56:58+05:30 IST