పన్నుల పెంపు సిగ్గుచేటు

ABN , First Publish Date - 2021-06-18T05:27:01+05:30 IST

పన్నుల పెంపు సిగ్గుచేటు

పన్నుల పెంపు సిగ్గుచేటు
శ్రీకాకుళంలో ధర్నా చేస్తున్న సీపీఎం కార్యకర్తలు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: కరోనా కష్టకాలంలో ప్రజలపై ఆస్తి, చెత్త పన్ను  భారం మోపడం సిగ్గుచేటు అని సీపీఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి ఆందో ళన వ్యక్తం చేశారు. గురువారం  శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆస్తి విలువల ఆధారంగా ఇంటి పన్ను విధించే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. చెత్తపన్ను జీవోను తెచ్చి ప్రజలను మరింత ఇబ్బందులు పెడుతు న్నారన్నారు. పన్నుపెంపు జీవోలు 196, 198లను తక్షణమే రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నగర పౌరసం క్షేమ సంఘం నాయకుడు టి.తిరుపతిరావు, వివిధ సంఘాల నాయకులు  ఆదినారా యణమూర్తి, పార్వతీశం, ఎం.తిరుపతిరావు, మోహన్‌రావు, శ్రీదేవిపాణిగ్రహి తదితరులు పాల్గొన్నారు.  పాలకొండ రూరల్‌: ఆస్తి, చెత్త, డ్రైనేజీ, తాగునీరు పన్నుల పెంపునకు జారీచేసిన  196, 197, 198 జీవోలను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం కార్యదర్శి దావాల రమణారావు డిమాండ్‌ చేశారు. గురువారం పాలకొండ నగరపంచాయతీ పరిధిలోని ఎన్‌కేరాజపురంవార్డు సచివాలయం వద్ద పట్టణ సౌర సంఘాల సమాఖ్య సభ్యులు నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కాయల రమేష్‌, సిద్దాబత్తుల భాస్కరరావు, గోగుల జోగినాయుడు పాల్గొన్నారు.

 

Updated Date - 2021-06-18T05:27:01+05:30 IST