దొంగోడికి ఓట్లేసి నాశనం చేసుకున్నాం

ABN , First Publish Date - 2022-05-29T08:19:34+05:30 IST

దొంగోడికి ఓట్లేసి నాశనం చేసుకున్నాం

దొంగోడికి ఓట్లేసి నాశనం చేసుకున్నాం

ఎన్నికల్లో వైసీపీని శ్మశానంలో తగులబెడతారు: అయ్యన్న 

అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): ‘‘పదహారు నెలలు జైల్లో ఉన్న దొంగోడికి ఓట్లేసి రాష్ట్రాన్ని చేజేతులా సర్వనాశనం చేసుకున్నాం. చెత్త నా...ళ్లు, పనికిమాలిన వాళ్లు మంత్రులుగా ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోలేం’’ అని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఒంగోలులో మహానాడు సభా వేదిక నుంచి ప్రసంగించిన ఆయన తనదైన శైలిలో వైసీపీ నేతలపై  విరుచుకుపడ్డారు. ‘‘ప్రతి తెలుగుదేశం కార్యకర్త, అభిమానికి పండుగ లాంటి మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానాలు చూసిన దౌర్భాగ్యుడు తమ్మినేని సీతారాం ఈ వేదికను వల్లకాడు, శ్మశానం అంటారా? రాబోయే ఎన్నికల్లో నీతో పాటు నీ పార్టీ వైసీపీని, జగన్‌ను అదే శ్మశానంలో ప్రజలు తగులబెడతారని గుర్తుంచుకో. అరగంట, గంట అంటూ రాత్రిపూట మల్లెపూలు అమ్ముకునే అంబటి రాంబాబు లాంటోడు మంత్రా? బూతులు మాట్లాడే రింగుల రాణి రోజా ఆంటీ మొగుడికి చీరకట్టి ఇంట్లో కూర్చోబెట్టింది. ఆమె తెలుగుదేశం వాళ్లకు చీరలు పంపుతుందట. రాజకీయాలంటే జబర్దస్త్‌ అనుకుంటోందా?’’ అని అయ్యన్న విమర్శించారు. ఎన్టీఆర్‌ దయవల్ల 40 ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్నానన్నారు. రాష్ట్రానికి ఏమి కావాలో పదేళ్ల ముందే ఆలోచించే నాయకుడు చంద్రబాబు అని, ఆయన ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రాన్ని కాపాడటం ఎవరి తరమూ కాదన్నారు. బాలయోగి, ప్రతిభా భారతి, అబ్దుల్‌ కలాం వంటి వారిని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిన తెలుగుదేశం పార్టీని లోకేశ్‌ నాయకత్వంలో, చంద్రబాబు బాటలో నడిపించాల్సింది యువతరమేనని అన్నారు. సభలో పలువురు టీడీపీ నేతలు మాట్లాడారు. 


వైసీపీ నేతలకు ప్రజలు చీపుర్లతో స్వాగతం: అఖిల 

అధికార వైసీపీ నేతలు గ్రామాలు, కాలనీల్లోకి వస్తుంటే ప్రజలు చీపుర్లు పట్టుకుని సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. టీడీపీ నేతలు ప్రజల కోసం వస్తుంటే ప్రజలు ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారన్నారు. తాము నాయకులుగా ఉన్నామంటే కార్యకర్తలే కారణమంటూ, వారిని దేవుళ్లతో పోల్చి దండం పెట్టారు. ఓ భుజం మీద జెండా, మరో భుజం మీద నేతలను మోస్తూ కార్యకర్తలు కష్టపడుతున్నారని కొనియాడారు. 



Updated Date - 2022-05-29T08:19:34+05:30 IST