పట్టపగలు బరితెగించిన దొంగ.. ఎస్‌బీఐ కస్టమర్ కేర్ సెంటర్‌లోకి చొరబడి చివరకు అతడు చేసిన దారుణం..

ABN , First Publish Date - 2022-08-25T00:22:16+05:30 IST

సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలో మంచి చెడ్డ అనే కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తూ.. చివరకు జీవితాలను నాశనం..

పట్టపగలు బరితెగించిన దొంగ.. ఎస్‌బీఐ కస్టమర్ కేర్ సెంటర్‌లోకి చొరబడి చివరకు అతడు చేసిన దారుణం..

సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలో మంచి చెడ్డ అనే కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తూ.. చివరకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరైతే చివరకు హత్యలకు కూడా తెగబడుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ దొంగ పట్టపగులు దారుణానికి పాల్పడ్డాడు. ఎస్‌బీఐ కస్టమర్ కేర్ సెంటర్‌లోకి చొరబడిన అతను చేసిన నిర్వాకం.. చివరకు తీవ్ర సంచలనం సృష్టించింది.


ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh) రాష్ట్రం రాయ్‌పూర్ నగర పరిధి ఫఫాదీ చౌక్‌లోని ఎస్‌బీఐ కస్టమర్ కేర్ సెంటర్‌లో (SBI Customer Care Center) ఈ ఘటన చోటుచేసుకుంది. యాలాల ప్రకాష్‌ అనే వ్యక్తి.. స్థానికంగా ఎస్‌బీఐ కస్టమర్ కేర్ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం ఓ అగంతకుడు కస్టమర్ కేర్ సెంటర్‌లోకి ప్రవేశించాడు. కొద్దిసేపు యజమానితో మాటలు కలిపాడు. తర్వాత ఫొటో కాపీలు చేయించుకున్నాడు. ఈ క్రమంలో సెంటర్ యజమాని పరధ్యానంలో ఉండగా.. అప్పటికే సంచిలో పెట్టుకున్న సుత్తిని బయటికి తీసి, ఒక్కసారిగా యజమాని తలపై బలంగా కొట్టాడు. దీంతో యలాల ప్రకాష్ కుప్పకూలిపోయాడు.

fishing: చేపల కోసం వల వేస్తే.. ఇది పడిందేంటీ.. భయంతో పరుగులు తీసిన మత్స్యకారులు.. చివరకు ఏమైందంటే..


మళ్లీ రెండు సార్లు తలపై బలంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు. తర్వాత అక్కడ ఉన్న నగదు తదితరాలను ఎత్తుకెళ్లాడు. కాసేపటికి గమనించిన స్థానికులు.. గాయపడ్డ యలాల ప్రకాష్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బలమైన గాయమవడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అతడు స్పృహలోకి వస్తే గానీ ఎంత నగదు చోరీ అయ్యిందనే విషయం తెలీదని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న దుండగుడి కోసం గాలిస్తున్నారు. పట్టపగలే ఈ దారుణం చోటు చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

మేనమామ లేని సమయంలో మాత్రమే ఇంటికి వెళ్లే యువకుడు.. ఓ రోజు మామతో పాటూ గంగా నది ఒడ్డుకు వెళ్లగా.. చివరకు ఏం జరిగిందంటే..



Updated Date - 2022-08-25T00:22:16+05:30 IST