లేఅవుట్‌ స్థలాల డాక్యుమెంట్ల దొంగలు ఎవరో తేల్చాలి

ABN , First Publish Date - 2022-10-01T05:35:29+05:30 IST

హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీకి చెందిన లేఅవుట్లలోని స్థలాల డాక్యుమెంట్లను దొంగిలించింది ఎవరో తేల్చాలని నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

లేఅవుట్‌ స్థలాల డాక్యుమెంట్ల దొంగలు ఎవరో తేల్చాలి
హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ మహాధర్నాలో మాట్లాడుతున్న నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

 స్థలాలు కబ్జా చేసిన నేతలకు అధికార పార్టీ అండ

 నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

 మునిసిపల్‌ కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ పార్టీ మహాధర్నా

హుజూర్‌నగర్‌, సెప్టెంబరు 30 : హుజూర్‌నగర్‌ మునిసిపాలిటీకి చెందిన లేఅవుట్లలోని స్థలాల డాక్యుమెంట్లను దొంగిలించింది ఎవరో తేల్చాలని నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మునిసిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, లేఅవుట్ల భూముల డాక్యుమెంట్ల మాయంపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మునిసిపల్‌ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు హాజరైన ఎంపీ మాట్లాడుతూ హుజూర్‌నగర్‌ పట్టణ మేజర్‌గ్రామపంచాయతీగా ఉన్న సమయంలోనే లేఅవుట్లలోని ప్రభుత్వ స్థలం 50వేల గజాలకుపైగా ఉండేదన్నారు. వాటితో పాటుగా మునిసిపాలిటీగా మారాక మరో40 వేల గజాల స్థలం వెంచర్ల యజమానులు అప్పగించారన్నారు. ప్రస్తుతం మునిసిపాలిటీకి లక్ష గజాల స్థలం ఉండాలన్నారు. 25 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన వెంచర్‌లోని మునిసిపల్‌ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల పరం చేశారన్నారు. ఆ స్థలాలను కాపాడాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు కంచే చేను మేసిన చందంగా ఆ భూముల డాక్యుమెంట్లు, అగ్రిమెంట్లు మాయం చేశారని ఆరోపించారు. 2019 ఉపఎన్నిక జరిగిన నాటి నుంచి మునిసిపల్‌ భూములకు సంబంధించిన అగ్రిమెంట్ల పత్రాలు మాయమయ్యాయని ఆరోపించారు. అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులు మాత్రమే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.సాయిబాబా థియేటర్‌ పక్కన 5,500గజాల స్థలంలో రూ.70 లక్ష లతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి మంత్రి జగదీ్‌షరెడ్డి శంకుస్థాపన చేయగా, ఆ మార్కెట్‌ను ఎన్‌ఎస్పీ క్యాంపులోకి మార్చి నిర్మాణ అంచనాను ఏడున్నర కోట్ల రూపాయలకు పెంచారని ఆరోపించారు. ఆ స్థలాన్ని ప్రైవేటువ్యక్తులకు ఇచ్చేందుకే మార్కెట్‌ను ఎన్‌ఎస్పీ స్థలంలోకి మార్చారన్నారు. వీపీఆర్‌ టవర్‌లో 3,250 గజాలు, పద్మశాలీ భవన్‌ పక్కన 2,400 గజాలు, పాత శ్రీలక్ష్మి థియేటర్‌ పక్కన 1500గజాల ప్రభుత్వ స్థలాలు మునిసిపల్‌ ఆధీనంలో లేవన్నారు. వాటి డాక్యుమెంట్లు మాయం చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ రూ.40కోట్లు హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల మునిసిపాలిటీకి ఇవ్వగా, కౌన్సిలర్ల తీర్మానంలేకుండా పబ్లిక్‌హెల్త్‌కు మార్చి రూ.4 కోట్ల కమీషన్‌ తీసుకుని ఎమ్మెల్యే సైదిరెడ్డి నిధులు పక్క దారి పట్టించాడన్నారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి గిరిజనుల భూములు వందల ఎకరాలు ఆక్రమించగా, అవిప్రభుత్వ భూమిగా తేలినా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, ఎస్పీలను కోరినా మాట దాటవేశారన్నారు.ధర్నా అనంతరం డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ ఆధ్వర్యంలో కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డికి పలు డిమాండ్లపై వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జున్‌ అధ్యక్షతన జరిగిన ఆందోళనలో యరగాని నాగన్నగౌడ్‌, సాముల శివారెడ్డి, అల్లం ప్రభాకర్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌, దొంగరి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, కస్తాల శ్రావణ్‌, సంపత్‌రెడ్డి, రాజానాయక్‌, విజయ వెంకటేశ్వర్లు, జైలు, వీరారెడ్డి, నాగరాజు, వీరబాబు, శివ రాం, గిరిబాబు, సుదర్శన్‌, కొణతం చిన్నవెంకట్‌రెడ్డి, అంజిరెడ్డి, అజీజ్‌ పాషా, అంజయ్య, బచ్చు రామారావు, మట్టయ్య, చంద్రశేఖర్‌, రాంమ్మూర్తి, జానయ్య, రేపాకుల కోటయ్య, బెంజిమెన్‌, గొట్టెముక్కల రాములు, ఎండి నిజాముద్దీన్‌, చక్ర వీరారెడ్డి, కుందూరు శ్రీనివా్‌సరెడ్డి, తేలుకుంట్ల వెంకటేశ్వర్లు, సైదులు, బెల్లంకొండ గురవయ్య, శాసనాల నాగసైదులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T05:35:29+05:30 IST