టైటిల్‌ మారింది

Nov 30 2021 @ 01:10AM

అజయ్‌ దేవగణ్‌ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మే డే’ టైటిల్‌ మారింది. తన సినిమా పేరుని ‘రన్‌వే 34’గా మార్చినట్లు సోమవారం ట్విట్టర్‌ ద్వారా అజయ్‌  వెల్లడించారు. పేరు ఎందుకు మార్చారో కారణాలు ఆయన వెల్లడించలేదు. కొన్ని యథార్థ సంఘటనలతో రూపుదిద్దుకొన్న ఈ థ్రిల్లర్‌ 2022 ఏప్రిల్‌ 29న విడుదలవుతుందని తెలియజేశారు. అమితాబ్‌ బచ్చన్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పైలెట్స్‌గా కనిపిస్తున్న పోస్టర్స్‌ ఆయన జత చేశారు. ఈ సినిమాలో అజయ్‌ కూడా పైలెట్‌గా నటిస్తున్నారు. 2016లో వచ్చిన ‘షివాయ్‌’ చిత్రం తర్వాత అజయ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే.


అజయ్‌తో హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఇది రెండో సినిమా.  ‘దే దే ప్యార్‌ దే’ (2019) వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా. అలాగే అమితాబ్‌తో కలసి నటించడం ఆమెకు ఇదే తొలిసారి. తన   పోస్టర్‌ను రకుల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగానే ఆమె బాయ్‌ఫ్రెండ్‌, నిర్మాత జాకీ భగ్నానీ ‘పైలెట్‌ మేడమ్‌’ అని కామెంట్‌ చేశారు.

Follow Us on:

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.