చెట్టు నిండా కాయలు - మాగకనే నిష్ప్రయోజనం

ABN , First Publish Date - 2022-08-08T04:58:30+05:30 IST

ఏటా సుమారు వంద కిలోల ఖర్జూరం కాయలతో చెట్టు కళకళలాడుతుంటోంది. అయితే కాయలు మాగకుండానే రాలిపోతున్నాయి.

చెట్టు నిండా కాయలు - మాగకనే నిష్ప్రయోజనం

30ఏళ్లగా ఇదే వరస

పి.కొత్తపల్లెలో చాలా ఇళ్లల్లో ఖర్జూరపు చెట్లు

పెనగలూరు, ఆగస్టు 7: ఏటా సుమారు వంద కిలోల ఖర్జూరం కాయలతో చెట్టు కళకళలాడుతుంటోంది. అయితే కాయలు మాగకుండానే రాలిపోతున్నాయి. సుమారు 30 ఏళ్ల గా ఇదే విధంగా జరుగుతుండడంతో యజమానికి నిష్ప్ర యోజనమే తప్ప లాభం లేదు. ప్రయోజనం లేకపోయినా ఇంటి పెరట్లో ఉన్న చెట్టును తొలగించకుండా కాపాడుకుం టూ వస్తున్నాడు. ఏటా సుమారు పదివేలకు పైగా ఆర్థికంగా ఆదుకోకపోయినా దాని పట్టు మమకారాన్ని ప్రదర్శిస్తున్నారు. వివరాల్లోకెళితే....

 పెనగలూరు మండలం పి.కొత్తపల్లె వాసి షేక్‌ అబ్దుల్‌ రవూఫ్‌ చిన్నతనంలో (65ఏళ్ల కిదంట) దాదా సాహెబ్‌ మా ఇంటి పెరట్లో ఈ చెట్టు నాటాడు. అప్పటి నుంచీ చెట్టు బాగోగులు చూసుకుంటూ వస్తున్నాను. చెట్టు పెద్దదై కాపు కాసే సమయం రానే వచ్చింది. ఈత పండ్ల సీజను ముగిశా క ఖర్జూరపు జాతి కాయలు కాస్తుంది. ఇదే అదునులో చెట్టు నిండా ఖర్జూరపు కాయలే. ఎంతో సంతోషించాను. ఆసంతో షం ఎంతోకాలం నిలవలేదు. జూలై నెలాఖరు నాటికి కాయ లు రాలిపోతున్నాయి. దీని గురించి ఉద్యానశాఖ అధికారు లు, సిబ్బంది ఎవరైనా సూచనలు సలహాలు ఇస్తారనుకున్నా ఫలితంలేదు. ఈ చెట్టు సస్యరక్షణ, పోషణ గురించి ఎవరూ చెప్పిన పాపాన పోలేదు.

మండలంలో ఇలాంటి చెట్లు ఎన్ని ఉన్నాయో గుర్తించి ఈ చెట్లపై ప్రయోగాలు చేస్తే దాని పోషకులకు ఏమైనా మేలు జరుగుతుంది. ఎడారి ప్రాంతాల్లో పెరిగి సత్ఫలితాలిచ్చే ఖర్జూర చెట్లు మన ప్రాంతాల్లో కూడా పెరిగి పెద్దవై కాపుకాస్తూ పూర్తి ఫలితాలివ్వకపోవడంపై ఉద్యాన శాఖాధికారులు దృష్టి సారిస్తే మన ప్రాంతాల్లో కూ డా ఈ సాగు సాధ్యమవుతుందేమో పరిశీలించాలని ఆయన కోరారు. ఇదిఇలా ఉండగా గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలు చేసు కుంటూ రెండు, మూడేళ్లకొకసారి సొంత ఊరికొచ్చిపో యే ప్రవాసాంధ్రులు పెరటితోటల్లో ఖర్జూర చెట్లను పెంచుతున్న ట్లు సమాచారం. 

వంద కిలోల కాయలు నిష్ప్రయోజనం

 చిన్నప్పుడు దాదా సాహెబ్‌ మా ఇంటి పెరట్లో ఈ చెట్టు నా టా డు. దానిని జాగ్రత్తగా పెం చు కుంటూ వస్తున్నాం. దాదాపు 30 ఏళ్లగా కాయలు కాస్తోంది. ముది రిన కాయలు రాలిపోతుంటాయి. అవి తినడానికి బాగుండవు. అ యినా సరే వీధిలోని పిల్లలు తీసు కునిపోతుంటారు, మరికొన్నింటిని కోతులు తినేస్తుంటాయి.  ఇటీవల రాత్రి వేళ కొన్ని పక్షులు ఎక్కడి నుంచో వస్తున్నా యి. అవి రావడం మొదలు పెడితే వారం పది రోజుల్లో చెట్టును ఖాళీ చేస్తాయి. దీని కాయలు మాగాలంటే మరో మగ చెట్టు ద్వారా ఫలదీకరణం చెందితే మాగుతాయని ఎవ రో చెబితే విన్నాను. ఉద్యాన శాఖాధికారులు దీనిని పరిశీలిస్తే ప్రయోజనముం టుందేమోనని భావిస్తున్నా.

Updated Date - 2022-08-08T04:58:30+05:30 IST