Weight loss: 161 కేజీల బరువున్న ఈ వ్యక్తి ఏడాది తిరిగేసరికి ఇలా.. ఎన్ని కిలోలు తగ్గాడో.. ఇప్పుడెంత బరువున్నాడో తెలిస్తే..

ABN , First Publish Date - 2022-10-01T23:02:27+05:30 IST

ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరుగుతుంటారు.

Weight loss: 161 కేజీల బరువున్న ఈ వ్యక్తి ఏడాది తిరిగేసరికి ఇలా.. ఎన్ని కిలోలు తగ్గాడో.. ఇప్పుడెంత బరువున్నాడో తెలిస్తే..

ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరుగుతుంటారు. ఊబకాయం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. వాటిని అర్థం చేసుకున్న వారు బరువు తగ్గేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. జిమ్‌కు వెళ్లడం ప్రారంభిస్తారు. డైటింగ్‌లు చేస్తారు. ఈ రెండింటి విషయంలో జాగ్రత్తగా ఉంటే బరువు తగ్గడం పెద్ద కష్టం కాదని అమెరికాకు చెందిన దిమిత్రి అజోవ్‌స్కీ చెబుతున్నాడు. ఇతను గతంలో 161 కిలోలు ఉండేవాడు. ఏడాది తిరిగేసరికి 91 కిలోలకు తగ్గాడు. బరువు తగ్గేందుకు అతను పాటించిన సూత్రాలేంటో తెలుసుకుందాం. 


ఇది కూడా చదవండి..

Antarctica: అంటార్కిటికాలోని హిమానీ నదం నుంచి రక్తప్రవాహం.. శాస్త్రవేత్తలకూ అంతుబట్టని రహస్యం.. కారణం కోసం అన్వేషణ


దిమిత్రి వృత్తి రీత్యా ట్రక్ డ్రైవర్. 2021లో దిమిత్రి బరువు సుమారు 161 కిలోలు. ప్రస్తుతం అతని బరువు 95 కిలోలు. `బరువు తగ్గాలని నిర్ణయించుకున్న వెంటనే నేను ఇంట్లోనే బరువులు ఎత్తే వ్యాయామం ప్రారంభించాను. కొంత బరువు తగ్గినట్టు అనిపించాక జిమ్‌లో జాయిన్ అయ్యాను. జిమ్‌లో వర్కవుట్స్ చేయడంతో పాటు నా డైట్‌ను కూడా పూర్తిగా మార్చుకున్నాను. అప్పటివరకు నేను జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా తినేవాడిని. ఆ తర్వాత వాటికి పూర్తిగా దూరమై ప్రొటీన్ ఫుడ్ మాత్రమే తీసుకోవడం మొదలుపెట్టాను. మాంసాహారం ఎక్కువగా తినేవాడిని. ఉదయం భారీగా టిఫిన్ తీసుకునేవాడిని. రాత్రి మాత్రం పచ్చి కూరగాయాలు, టమోటాలతో సరిపెట్టుకునే వాడిని. పుష్కలంగా నీటిని తాగేవాడిని. బరువు తగ్గడానికి ఉపయోగపడే సప్లిమెంట్స్ కూడా తీసుకున్నా. రోజుకు గంటన్నర పాటు వ్యాయామం చేసేవాడిని. అది కాకుండా 45 నిమిషాలు పాటు కార్డియో ఎక్సర్‌సైజులు కూడా చేసేవాడిన`ని చెప్పాడు. 


ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి.. 


బరువు తగ్గించే ప్రయాణం మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది. అయినా నిరుత్సాహపడకూడదు. మీరు ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండాలని గుర్తుంచుకోండి. మీ వైఖరి సానుకూలంగా ఉంటే, మీరు మీ ప్రయాణాన్ని సులభంగా పూర్తి చేస్తారు. 


ఆహారం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. బరువు తగ్గే ప్రక్రియ 90 శాతం వరకు ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. 


నిద్ర బరువు తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. కాబట్టి మీరు తగినంత నిద్రపోకపోతే బరువు తగ్గడం కష్టమవుతుంది. 


ప్రొటీన్ తీసుకోవడంపై శ్రద్ధ వహించండి. ఎందుకంటే ప్రోటీన్ మీ కడుపును నిండుగా ఉంచుతుంది. మీకు ఎక్కువ ఆకలి వేయదు. 


బరువులు ఎత్తే వ్యాయామంతో పాటు కార్డియో కూడా చేయండి. వ్యాయామం తర్వాత 20 నిమిషాలు కార్డియో చేస్తే.. ఫలితం మెరుగ్గా ఉంటుంది.  


నీరు ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తాగండి. ఫైబర్ ఎక్కువగా ఉన్న నీరు తాగగలితే మరింత మంచిది. 


ఉదయం భోజనం ఎక్కువగా ఉండాలి. రాత్రి భోజనం తక్కువగా, తేలికగా అరిగిపోయేలా ఉండాలి. జంక్ ఫుడ్‌ను అస్సలు తీసుకోకూడదు. పచ్చి కూరగాయలు, టమోటాలు వీలైనంత ఎక్కువ తినండి.



Updated Date - 2022-10-01T23:02:27+05:30 IST