కథలో మలుపులు ఆకట్టుకుంటాయి

Published: Thu, 18 Aug 2022 07:12:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కథలో మలుపులు ఆకట్టుకుంటాయి

‘శుక్ర’ చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు సుకు పూర్వజ్‌. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మాటరాని మౌనమిది’. మహేష్‌ దత్త, శ్రీహరి ఉదయగిరి, సోనీ శ్రీ వాస్తవ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ నెల 19న విడుదలవుతున్న సందర్భంగా సుకు పూర్వజ్‌ మాట్లాడుతూ ‘హారర్‌, థ్రిల్లర్‌, ఫిక్షన్‌ కలబోతగా ఈ సినిమా రూపొందించాం. రెండు మేజర్‌ క్యారెక్టర్స్‌కు సంబాషణలు ఉండవు. కథలో ఐదారు మలుపులు ఉంటాయి. అవన్నీ ఒక శాస్త్రీయ అంశంతో ముడిపడి ఉంటాయి. నా తదుపరి చిత్రాల వివరాలు త్వరలో వెల్లడిస్తాను’ అన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International