కార్మికశాఖ ఏజెంట్లలో మారని తీరు

ABN , First Publish Date - 2021-07-26T05:35:09+05:30 IST

కార్మికశాఖ ఏజెంట్ల తీరులో మార్పు రాలేదు. కొందరు అధికారులు, ఏజెంట్లతో కుమ్మకై వారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు.

కార్మికశాఖ ఏజెంట్లలో మారని తీరు

 మేమొక్కరమే తిన్నామా, అధికారులు కూడా తిన్నారుగా అంటూ చర్చలు

కార్యాలయంలోనే ఫైళ్లు రాస్తున్న  ఏజెంట్ల్‌, అసిస్టెంట్లు

త్వరలో ఖమ్మానికి రాష్ట్ర అధికారులు

ఖమ్మంక్రైం, జూలై23: కార్మికశాఖ ఏజెంట్ల తీరులో మార్పు రాలేదు. కొందరు అధికారులు, ఏజెంట్లతో కుమ్మకై వారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై ‘ఆంధ్రజోతి’లో ఇటీవల  కఽథనాలు ప్రచురి తమవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జ్‌ ఏసీయల్‌ కార్యాలయంలో సిబ్బందికి, అధికారులకు సమావేశం నిర్వహించారు. మరోసారి ఏజెంట్లను కార్యాలయం వద్దకు రానివ్వొద్దని, వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయ్యాలని, వారికి సహకరించారని దృష్టికి వస్తే జాయింట్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసి మేమోలు ఇస్తానని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. గతంలో జిల్లాలోని కొన్ని మండలాల్లో పలువురు ఏజెంట్లపై పోలీసులకు ఫిర్యాదులు చేశారు. విచారణ జరిపేలోపే ఏజెంట్లు బాధితులకు కొంత డబ్బు ఇచ్చి వ్వవహరం బయటకు రాకుండా జాగ్రత్త పడినట్టు తెలిసింది. 

పత్రికల్లో కథనాలు వచ్చినా.. మకేం కాదు!

పత్రికల్లో ఎన్ని కథనాలు వచ్చినా.. అధికారుల సపోర్టు మాకే ఉందని ఏజెంట్లు ధీమాతో ఉన్నట్టు కూడా తెలిసింది. ఓఏజెంట్‌ నాకు వెల్ఫెర్‌ బోర్డు నుంచి సర్టిఫికెట్‌ ఉంది నేను ఏదైనా చేయోచ్చు అని చెబుతున్నాడు.  దీనిపై సిబ్బందిని ప్రశ్నించగా, అలాంటివి ఏమి లేదని గతంలో అన్‌లైన్‌ లేకుండా ఉన్న సమయంలో కార్మికులను చేర్చేందుకు కొంతమందిని కమిటీని  వేశారని, ప్రస్తుతం 2018 నుండి అలాంటి జీవోను రద్దు చేసినట్టు తెలిపారు. ఖమ్మం కార్మికశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న కొందమంది సిబ్బంది కుటుంబ సభ్యులు కూడా ఏజెంట్లు గా నడిపిస్తున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. నేడో రేపో ఇన్‌చార్జ్‌ డీసీయల్‌గా కరీంనగర్‌ డీసీయల్‌ రమేష్‌బాబు ఖమ్మం వచ్చి చార్జి తీసుకోనున్నారు. మరో 10రోజులలో విచారణ చేసేందుకు కార్మికశాఖ వరంగల్‌ జోన్‌ అధికారులు వచ్చి ఆరోపణలు ఉన్న సిబ్బందిపై, పలువురు ఏజెంట్ల విచారణ చేసి చర్యలు తీసుకోన్నట్లు తెలిసింది.  

 కార్యాలయంలోనే ఫైల్లు రాస్తున్న ఏజెంట్లు 

కార్మిక శాఖలో ఏజెంట్లను రానివ్వోద్దని అధికారులు సిరియస్‌గా చెప్పినప్పటికి ఇంకా దర్జాగా కార్యాలయంలోనే ఏజెంట్లు వారి అసిస్టెంట్లు ఫైళ్లు రాస్తు చక్రం తిప్పుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం కార్మికశాఖ కార్యాలయంలో ఓఏజెంట్‌ తన వద్ద పని చేస్తున్న ఇద్దరు అసిస్టంట్లుతో కలిసి ఫైల్స్‌ రాస్తు కూర్చున్నారు. పదేళ్లుగా కార్మికశాఖ ఏజెంట్‌గా చేస్తు పలువురి కార్మికులను మోసం చేసినట్టు తెలిసింది.  గతంలో మండలంలో ఆయనపై కేసుకూడా అయినట్టు తెలిసింది. ఇయనతో పాటుగా మిగతా ఏజెంట్లు ఆంధ్రజ్యోతి విలేకరి రావడం చూసి మాస్కులు పెట్టుకుంటూ, అక్కడి నుండి వెళ్ళిపోయారు.

 నామిని నుంచి రూ.4లక్షల డీల్‌

 నగరంలోని ఓమహిళ కార్మికురాలుగత సంవత్సరంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమ్తె నామినికి రావాల్సిన రూ.6.30లక్షల్లో 4లక్షలు ఇవ్వాలని డీల్‌ మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఆ డబ్బు ఇంకా శాఖ నుంచి రాకపోవడవంతో ఖర్చులకు కొంత డబ్బు చెలించాలని అడిగినట్టు తెలిసింది. మేము ఇవ్వలేమని సమాధానం చెప్పారు. వారి ఫోన్‌ కూడా ఎత్తడం లేదని బాధితులు కార్యాలయంలోని సిబ్బందికి తెలిపినట్టు తెలిసింది.

విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం

సునీత, జోన్‌ కార్మికశాఖ జాయింట్‌ కమిషనర్‌ 

 ఏజెంట్ల అవినితి ఆరోపణలుపై 10 రోజులలో ఖమ్మం కార్యాలయంతో పాటు జిల్లాలోని పలు కార్యాలయాలలో ఫైల్స్‌ వెరిఫికేషన్‌ చేస్తాం. అధికా రులైనా, ఏజెంట్లపైన చర్యలు తీసుకుంటాం. పోలీసులతో పాటు, పలువురి అధికారుల సమక్షంలో విచారణ జరిపి అవపరమైతే వారిపై కేసులు నమోదు చేస్తాం.

Updated Date - 2021-07-26T05:35:09+05:30 IST