మారని ‘రెవెన్యూ’ తీరు

ABN , First Publish Date - 2021-11-26T05:23:00+05:30 IST

మార్కాపురం రెవె న్యూ శాఖలో అధికారులు, సిబ్బంది తీరు మారలేదు.

మారని ‘రెవెన్యూ’ తీరు

పైసలివ్వనిదే పని జరగదు..!

న్యాయం జరగడం లేదని 

బాధితుల ఆవేదన

మార్కాపురం, నవంబరు 25: మార్కాపురం రెవె న్యూ శాఖలో అధికారులు, సిబ్బంది తీరు మారలేదు. గతంలో పనిచేసిన అధికారులు, సిబ్బంది చేసిన త ప్పిదాలకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నప్ప టికీ కొత్తగా విధుల్లో చేరినవారు అదేబాటలో నడు స్తున్నారు. ఇటీవల తహసీల్దార్‌ కార్యాలయంలో జరి గిన ఒక ఫైలుకు సంబంధించి అధికారులు స్పందిం చిన విధానం వారి పనితీరుకు నిదర్శనంగా మారింది.

ఒకే పొలం.. రెండు విధానాలు

మండల రెవెన్యూ అధికారులు ఒకే కుటుంబ స భ్యులకు సంబంధించి రెండు విధాలుగా స్పందిం చారు. డబ్బు లిచ్చినవారికి అనుకూలంగా, డబ్బులు ఇవ్వని వారికి ప్రతికూలంగా పని చేశారు. ఇది వారి  తీరుకు అద్దపడుతోంది. మండలంలోని పెద్దయాచవ రం రెవెన్యూ పరిధిలోని మన్నెవారిపల్లెలో వల్లభనేని పెద్దక్క  ఏడాది క్రితం మృతిచెందింది.  ఆమెకు ఇద్ద రు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ఆడ పిల్లలలో అనారోగ్యకారణాలతో ఒకరు మృతి చెందా రు. మరో ఆమెకు వివాహమైన దోర్నాలలో నివాస ముంటోంది. వల్లభనేని పెద్దక్కకు ఖాతా నెంబరు 992లో 3.94 ఎకరాల భూమి ఉంది. ఆమె మరణా నంతరం ఆ భూమిపై హక్కు కల్పించాలని కోరుతూ పెద్దక్క కుమారులు వల్లభనేని పెద్దగాలెయ్య, చిన్న గాలెయ్య మీ సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకు న్నారు. అందుకు సంబంధించిన ధ్రువీకరణపత్రా లను ఇద్దరూ ఎవరికి వారు రెవెన్యూ శాఖ సిబ్బం దికి అందజేశారు. వల్లభనేని పెద్దగాలెయ్యకు సంబంధించిన ఫైలును తిరస్కరించిన అధికారులు, చిన్నగాలెయ్యకు  చెందిన ఫైల్‌ను అమోదించారు.

ఒకరికి మంజూరు.. మరొకరికి తిరస్కరణ

తమ తల్లి పేరుతో ఉన్న భూమిని తమ ఇద్దరికీ పంచి పాసు పుస్తకం మంజూరు చేయాలని కోరు తూ అన్నదమ్ములిద్దరూ అధికారులకు  విజ్ఞప్తి చేశా రు. వారు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు ఒకటైన ప్పటికీ పాసుపుస్తకాలు ఒకరికి మాత్రమే మంజూరు చేసిన అధికారులకు మరొకరికి తిరస్కరించారు. ఇద్ద రికీ సంబంధించిన ఆస్తి పంపకం విషయంలో అధి కారులు ఇలా వ్యవహరించడానికి కారణం ఒకరు చేతులు తడపగా, మరొకరు కమీషన్‌ ఇవ్వలేదు. దీంతోనే అధికారులు ఇలా చేశారని బాధితులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.  

చేతులు తడపాల్సిందే!

మండలంలో భూములకు సంబంధించిన పనులు జరగాలంటే చేతులు తడపక తప్పదని బాధితులు వాపోతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఓ అధికారి ఈ వ్యవహారాన్ని ఎవరికీ తెలియకుండా చా పకింద నీరులా నడుపుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి వ్యవహారాల కారణంగా గతంలో పనిచేసి రిటైర్డ్‌ అయిన తహసీల్దార్‌ స్థాయి ఉద్యోగి జైలు కెళ్లినప్పటికీ రెవెన్యూ సిబ్బంది  తీరు లో మార్పురాకపోవడం గమనార్హం.


Updated Date - 2021-11-26T05:23:00+05:30 IST