తాలిబన్ ప్రభుత్వంపై అమెరికా ఆందోళన

ABN , First Publish Date - 2021-09-08T21:29:42+05:30 IST

తాలిబన్లు ప్రకటించిన ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంపై అమెరికా ఆందోళన

తాలిబన్ ప్రభుత్వంపై అమెరికా ఆందోళన

వాషింగ్టన్ : తాలిబన్లు ప్రకటించిన ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఐక్యరాజ్య సమితి బ్లాక్ లిస్ట్‌లో ఉన్నవారు పాలకులుగా మారారంటోంది. మరోవైపు ఈ ప్రభుత్వంలో మహిళలకు చోటు లేకపోవడం పట్ల పెదవి విరిచింది. ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఓ ప్రకటనను విడుదల చేసింది. 


‘‘ప్రకటించిన జాబితాలో తాలిబన్లు లేదా వారి సన్నిహిత సహచరులే ఉన్నారని, మహిళలు లేరని మేం గమనించాం. వీరిలో కొందరి ట్రాక్ రికార్డు, అనుబంధాలపై మేం ఆందోళన చెందుతున్నాం’’ అని ఈ ప్రకటన పేర్కొంది. 


తాలిబన్ల చర్యలనుబట్టి వారి ప్రభుత్వంపై అమెరికా తీర్పు ఇస్తుందని, వారి మాటలనుబట్టి కాదని పునరుద్ఘాటించింది. ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలను ప్రపంచం నిశితంగా పరిశీలిస్తోందని తెలిపింది. ఇతర దేశాలను బెదిరించడానికి ఆఫ్ఘన్ గడ్డను వాడుకోకుండా తాలిబన్లు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపింది. 


తాలిబన్లు మంగళవారం ప్రకటించిన తాత్కాలిక ప్రభుత్వాధినేత ముల్లా మహమ్మద్ హసన్ అకుండ్ ఐక్య రాజ్య సమితి బ్లాక్ లిస్ట్‌లో ఉన్నారు. ఇంటీరియర్ మినిస్టర్ సిరాజుద్దీన్ హక్కానీ ఎఫ్‌బీఐ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. 


Updated Date - 2021-09-08T21:29:42+05:30 IST