రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి

ABN , First Publish Date - 2022-06-25T06:50:29+05:30 IST

రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి.. జీవన ఎరువులు (పీఎస్‌బీ)వాడాలని జిల్లా వ్యవసాయాధికారి డి.రామారావునాయక్‌ అన్నారు.

రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి
సూర్యాపేట మండలం కుసుమవారిగూడెంలో రైతులకు జీవన ఎరువు సంచులను పంపిణీ చేస్తున్న జిల్లా వ్యవసాయాధికారి డి. రామారావునాయక్‌

 జిల్లా వ్యవసాయాధికారి డి.రామారావునాయక్‌

సూర్యాపేట రూరల్‌, జూన్‌ 24:  రైతులు రసాయన ఎరువుల    వినియోగాన్ని  తగ్గించి..  జీవన ఎరువులు (పీఎస్‌బీ)వాడాలని  జిల్లా వ్యవసాయాధికారి డి.రామారావునాయక్‌ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కుసుమవారిగూడెం గ్రామంలో  భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువు ఉపయోగంపై రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్ర మంలో ఆయన మాట్లాడారు. ఎక్కువ దిగుబడులు సాధించాలనే ఉద్దేశ్యంతో చాలా మంది రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులను ఉపయోగి స్తున్నారని అన్నారు. దీంతో భూసారం దెబ్బతిని భూమి తన సహజ స్థితిని కోల్పోతుందని ఆయన అన్నారు. ఒక ఎకరానికి సరిపడా జీవన ఎరువును 100 కిలోల పశువుల ఎరువుతోపాటు రెండు కిలోల జీవన ఎరువు ఫోస్పో బ్యాక్టీరియా కలిపి తయారుచేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. అనంతరం జీవన ఎరువు ఉపయోగం, ఫలితాలు తెలిపే పుస్తకాలను రైతు లకు అందజేశారు. కార్యక్రమంలో ఏవో జానీమియా, ఏఈవో ముత్తయ్య, ప్రభాకర్‌రెడ్డి, సత్తిరెడ్డి, సైదులు, నాగేంద్రరెడ్డి, రాములు పాల్గొన్నారు.

పచ్చిరొట్ట సాగుతో భూసారాన్ని పెంచుకోవాలి : ఏవోలు

కోదాడ రూరల్‌,  ఆత్మకూరు(ఎస్‌): రైతులు భూసారాన్ని పెంచేం దుకు పచ్చిరొట్ట పైర్లను సాగు చేయాలని కోదాడ, ఆత్మకూరు (ఎస్‌) మండ లాల వ్యవసాయాధికారులు పాలెం రజిని, దివ్య అన్నారు. శుక్ర వారం కోదాడ మండలం గుడిబండ గ్రామంలోని రైతువేదికలో నిర్వహించిన అవగాహన సదస్సులో రజిని,  ఆత్మ కూరు(ఎస్‌) మండలం  పాతసూర్యాపేట గ్రామంలో రైతులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో దివ్య మాట్లాడారు.  వరి  సాగు ఖర్చు తగ్గించుకునేందుకు వెదజల్లే పద్ధతిలో విత్తనాలు వేయాల న్నారు. రసాయనిక ఎరువులను  దశలవారీగా ఉపయోగిం చాలన్నారు. దీంతో పోషకాల సమతౌల్యం పెరిగి ఖర్చు తగ్గు తుందని రైతులకు సూచించారు.  కోదాడ, చిమిర్యాల, కాపు గల్లు, ఆత్మకూరు(ఎస్‌)లోని వ్యవసాయ సహకార కేంద్రాల్లో సబ్సిడీపై  పచ్చిరొట్ట, జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నా యని తెలిపారు.  కార్యక్రమంలో సల్మా,  కోటిరెడ్డి,  శ్రీనివాస రెడ్డి, బాలాజీ, భవ్య, శివమూర్తి పాల్గొన్నారు. 

ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలు: స్రవంతి

తుంగతుర్తి: ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని తుంగతుర్తి ప్రాంతీయ హార్టీకల్చర్‌ అధికారి స్రవంతి అన్నారు. శుక్రవారం మండలంలోని గొట్టిపర్తి గ్రామంలోని రైతువేదికలో రైతులకు ఆయిల్‌పామ్‌ సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాల న్నారు. పంట సాగులో మెలకువలు, దిగుబడి, మార్కెటింగ్‌ తదితర అంశా లపై అవగాహన కల్పించారు. ఆయిల్‌పామ్‌ సాగులో అంతర పంటలు కూడా సాగు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఈవో సాయి, సృజన, సాయిశ్రీజ, ఫీల్డ్‌ ఆఫీసర్లు కుమార్‌, చందా వెంకన్న, ఉపసర్పంచ్‌  హరి బాబు, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ వెంకన్న, రైతులు యాదగిరి, రామ చంద్రు, నగేష్‌, రామగిరి పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-25T06:50:29+05:30 IST