ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి

ABN , First Publish Date - 2022-07-05T05:02:58+05:30 IST

ప్లాస్టిక్‌ వా డాకాన్ని పూర్తిగా నిషేధించాలని, ఇందుకు ప్రజలు స హకరించాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు కోరారు.

ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలి
జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు

-  కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు

-  కలెక్టరేట్‌ నుంచి క్లాక్‌టవర్‌ వరకు ర్యాలీ

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, జూలై 4 :  ప్లాస్టిక్‌ వా డాకాన్ని పూర్తిగా నిషేధించాలని, ఇందుకు ప్రజలు స హకరించాలని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు కోరారు. ప్లాస్టిక్‌  నిషేధంపై ప్రజలలో అవగాహన కల్పించే ని మిత్తం సోమవారం జిల్లాలో పెద్దఎత్తున ర్యాలీలు ని ర్వహించారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్‌ మునిసిపాలిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ నుంచి  క్లాక్‌ ట వర్‌ వరకు ఏర్పాటు చేసిన ర్యాలీని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రజలలో పెద్దఎత్తు న అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, మునిసిపల్‌ టౌన్‌లలో ర్యాలీ నిర్వహి స్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ వల్ల మనిషికి జరిగే ప్రమాదం, అదేవిధంగా భూమికి జరిగే నష్టంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంద న్నారు. దుకాణదారులు,  వ్యక్తులు, సంస్థలు,  ప్లాస్టిక్‌ కవర్లు వినియోగించినట్లైతే చట్టపరమైన చర్య తీసు కుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు. ప్రజలు చట్టాన్ని గౌరవించి ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధిం చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో  మునిసిపల్‌  కమిషనర్‌ ప్రదీప్‌ కుమార్‌, ఆయా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

‘ప్రజావాణి’కి 127 ఫిర్యాదులు

మహబూబ్‌నగర్‌  కలెక్టరేట్‌: జిల్లా వ్యాప్తంగా ప్రజ లు తమ సమస్యలను పరిష్కరించాలంటూ సోమ వారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 127 మంది వినతులు అందజేశారు. సోమవారం రెవెన్యూ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రా వు, జిల్లా అధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెకర్టర్‌ మాట్లాడు తూ స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిం చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంత కు ముందు మన ఊరు - మన బడి, పాఠ్యపుస్తకాల పంపిణీ, తెలంగాణకు హరితహారం వంటి అంశాలపై అధి కారులతో సమీక్షంచారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, డీఆర్డీవో యాదయ్య, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్‌ పద్మశ్రీ, జడ్పీ సీఈవో జ్యోతి, ఆర్డీవో అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

 నూతన ఆవిష్కరణలకు ఆహ్వానం

మహబూబ్‌నగర్‌ ( కలెక్టరేట్‌ ) : ఇంటింటా ఇన్నోవేటర్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆసక్తి ఉన్న ఆవిష్కర్తల నుంచి నూతన ఆవిష్కరణలను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఇంటింటా ఇన్నో వేటర్‌ కార్యక్రమం చక్కని వేదికగా నిలుస్తుందని  తెలిపారు. రాష్ట్రంలో ఇన్నోవేషన్‌, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి తెలంగాణలోని అన్ని జిల్లాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా ఆవిష్కరణల ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు సూచించారు. జిల్లాలోని గ్రామీణ, విద్యార్థి, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఆవిష్కరణలు ( అన్ని రంగాలలో) ప్రజల నుండి ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వ్యాక్యాలు, రెండు నిమిషాల వీడియోను, ఆవిష్కరణ యొక్క నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్‌ నంబర్‌, వయసు, ప్రస్తుత వృత్తి, గ్రామం పేరు, జిల్లా పేరు తదితర వివరాలను   9100678543 నెంబర్‌కు వాట్సాప్‌ ద్వారా ఆగస్టు 5లోపు పంపించాలని కోరారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి ఫోన్‌ నెంబర్‌ 8897155001ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఆసక్తి కలిగిన ఆవిష్కర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-07-05T05:02:58+05:30 IST