టీకా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2021-01-16T05:08:23+05:30 IST

కరోనా నివారణ టీ కాను వైద్య సిబ్బం దితో పాటు అంగన్‌ వాడీ సిబ్బందికి పక డ్బందీగా ఇవ్వాలని ఎలాంటి ఇబ్బందు లు తల్తెకుండా ఎ ప్పటికప్పుడు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ లత అధికారులను, వైద్య సిబ్బందిని ఆదేశించారు.

టీకా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి
ఆస్పత్రి ఏర్పాట్లను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ లత

డిచ్‌పలి/ మా క్లూర్‌, జనవరి 15 : కరోనా నివారణ టీ కాను వైద్య సిబ్బం దితో పాటు అంగన్‌ వాడీ సిబ్బందికి పక డ్బందీగా ఇవ్వాలని ఎలాంటి ఇబ్బందు లు తల్తెకుండా ఎ ప్పటికప్పుడు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్‌ లత అధికారులను, వైద్య సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం డిచ్‌పల్లి సీహెచ్‌సీ, మాక్లూర్‌ పీహెచ్‌సీలో కరోనా వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లను పరిశీలించారు. డీఎంహెచ్‌వో సుదర్శనం, ఆర్డీవో రవి, తహసీల్దార్‌ వేణుగోపాల్‌గౌడ్‌, డాక్టర్లు బాబురావు, సంజీవరెడ్డి ని వివరాలు అడిగి తెలసుకున్నారు. డిచ్‌పల్లి ఆస్పత్రిలో వైద్య సిబ్బంది సంక్రాంతి పండుగకు వెళ్లారని వైద్యాధికారి అదనపు కలెక్టర్‌ అడిగిన పశ్నకు సమాధానం తెలపడంతో వైద్య సిబ్బంది తీరుపై ఒకింత అసహనం చేశారు.  

నేడు టీకా కార్యక్రమాన్ని ప్రారంభిచనున్న ఎమ్మెల్యే 

నేడు భారత ప్రధాని ప్రారంభించనున్న కరోనా వ్యాక్సినేషన్‌ టీకాను డిచ్‌పల్లి సామాజిక 30పడకల ఆస్పత్రిలో రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌  ప్రారం భిస్తారని తహసీల్దార్‌ వేణుగోపాల్‌ గౌడ్‌, ఎంపీడీవో సురేందర్‌, టీఆర్‌ఎస్‌ మండ లాధ్యక్షుడు కృష్ణ, తెలిపారు. కార్యక్రమానికి మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, సకాలంలో 10:30గంటలకు డిచ్‌పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిరావలని కోరారు. 

మోర్తాడ్‌కు కరోనా వ్యాక్సిన్‌ 

మోర్తాడ్‌: మండల కేంద్రంలోని పీహెచ్‌సీ ఆసుపత్రికి కొవిడ్‌ వ్యాక్సిన్‌లను జిల్లా అధికారులు స్థానిక డాక్టర్‌లకు అందజేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు 16నుంచి వ్యాక్సిన్‌లు ప్రారంభిస్తున్నందున సుదర్శనం, జిల్లా డాక్టర్‌ శివశంకర్‌ వ్యాక్సిన్‌లను అందజేశారు. స్థానిక డాక్టర్‌లు రమేష్‌, రవికుమార్‌లకు వ్యాక్సిన్‌లను అందజేశారు. తహసీల్దార్‌ శ్రీధర్‌, మండల ప్రత్యేక అధికారి బాలాజిసింగ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-01-16T05:08:23+05:30 IST