బాలికది ఆత్మహత్యే: డీఎస్పీ

ABN , First Publish Date - 2021-04-24T04:45:45+05:30 IST

మండలంలోని యాగంటిపల్లె గ్రామంలో అనూష (16) అనే బాలికది ఆత్మహత్యే అని డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు.

బాలికది ఆత్మహత్యే: డీఎస్పీ
మాట్లాడుతున్న డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి


బనగానపల్లె, ఏప్రిల్‌ 23:
మండలంలోని యాగంటిపల్లె గ్రామంలో అనూష (16) అనే   బాలికది ఆత్మహత్యే  అని డోన్‌ డీఎస్పీ నరసింహారెడ్డి తెలిపారు.  బనగానపల్లె ప్రభుత్వవైద్యశాలలో బాలిక అనూషకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వైద్యశాలలో డీఎస్పీ విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాలోని మరికల్‌ మండలం రాకుంటకు చెందిన తెలుగు రాముడు, తనకుమార్తె అనూషతో కలిసి యాగంటిపల్లె గ్రామ సమీపంలో జరుగుతున్న జీఎన్‌ఎ్‌సఎ్‌స కాల్వ వద్ద లైనింగ్‌ పనులు చేయడానికి కూలీలుగా  వచ్చారన్నారు.  గత మూడు నెలలుగా ఇక్కడ పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడు సంవత్సరాల నుంచి సంబంధిత కాంట్రాక్టర్‌ వద్దనే రాముడు పనిచేసేవారన్నారు. ఈనేపథ్యంలో రాముడు భార్య కూడా మృతి చెందడంతో కుమార్తెతో కలిసి కూలీ  పనులు చేసుకుంటూ జీవించే వాడన్నారు. బాలిక ఇతరులతో ఫోన్‌లో మాట్లాడుతుండగా మంచి పద్ధతి కాదని తండ్రితో పాటు ఇతర కూలీలు మందలించారన్నారు. దీంతో బాలిక గురువారం పనికి కూడా పోకుండా తాత్కాలికంగా వేసిన గుడిసె వద్దనే  ఉన్నట్లు తెలిపారు. తండ్రి పనికి పోయి వచ్చే సరికి జీఎన్‌ఎ్‌సఎ్‌స కాల్వ సమీపంలోని ఓ గుంత వద్ద డీజల్‌పై నిప్పటించుకొని మృతి చెందినట్లు డీఎస్పీ తెలిపారు. ఇంటి వద్ద మగ్గులో డీజల్‌ తీసుకొని వంటిపై పోసుకొని సమీపంలోని జీఎ్‌సఎ్‌సఎస్‌ కాల్వ వద్ద బాలిక  ఆత్మహత్య చేసుకునట్లు తెలిపారు.  కర్నూలు నుంచి క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ను కూడా రప్పించి పూర్తి స్తాయిలో విచారించామన్నారు. ఆత్మహత్యగానే తమ దర్యాప్తులో తేలిదన్నారు. పోస్టుమార్టం నిర్వహించిన ప్రభుత్వవైద్యశాల డాక్టర్‌ చరణ్‌రెడ్డి మాట్లాడుతూ బాలికను అత్యాచారం చేసినట్లు పోస్టుమార్టంలో నిర్ధారణ కాలేదని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. సమావేశంలో బనగానపల్లె సీఐ సురేశ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐలు కృష్ణమూర్తి, మహేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:45:45+05:30 IST