వెలుగోడు ఎద్దుల విజయం

ABN , First Publish Date - 2021-04-18T04:55:11+05:30 IST

కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో లక్ష్మీ సమేత వేణుగోపాలస్వామి, పార్వతి సమేత మల్లేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి పాలబండ లాగుడు పోటీలు నిర్వహించారు.

వెలుగోడు ఎద్దుల విజయం

కొత్తపల్లి, ఏప్రిల్‌ 17: కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామంలో లక్ష్మీ సమేత వేణుగోపాలస్వామి, పార్వతి సమేత మల్లేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి పాలబండ లాగుడు పోటీలు నిర్వహించారు. శనివారం దేవదాయ శాఖ గ్రామ పెద్దల సహకారంతో నిర్వహించిన ఈ బండ లాగుడు పోటీల్లో వెలుగోడు పట్టణానికి చెందిన అయ్యుబ్‌బాషా ఎద్దులు  4250 అడుగులు లాగి ప్రథమ బహుమతి రూ. 25000  గెలుచుకున్నాయి.  నందికొట్కూరు మండలం వడ్డెమాను గ్రామానికి చెందిన రామానాయుడు ఎద్దులు 3750 అడుగలు లాగి రెండో  బహుమతి రూ. 20000,  గడివేముల మండలం కే బొల్లవరం గ్రామానికి చెందిన తలారి వెంకటేశ్వర్లు ఎద్దులు 3530 అడుగుల లాగి మూడో  బహుమతి రూ.15000  కైవసం చేసుకున్నాయి. అలాగే పాములపాడు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన అవినాష్‌ ఎద్దులు  3500 అడుగుల లాగి 4వ బహుమతి రూ.10000, వెల్దుర్తి మండలం చెరకులపాడు గ్రామానికి  చెందిన రామాంజనేయులు ఎద్దులు  3500 అడుగులు 5వ బహుమతి రూ. 6000  కైవససం చేసుకున్నాయి.  మిడుతూరు మండలం దీపనగండ్ల గ్రామానికి చెందిన ప్రవీణ్‌కుమార్‌ ఎద్దులు  3120 అడుగులు లాగి 6వ బహుమతి రూ. 4000   కైవసం చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాములేటిరెడ్డి, గోవర్ధనరెడ్డితో పాటు పలువురు పెద్దలు పాల్గొన్నారు.  


బన గానపల్లె: మండలంలోని నందవరం చౌడేశ్వరీమాత తిరుణాల సందర్భంగా శనివారం రాష్ట్ర స్థాయి ఎద్దుల బండలాగుడు పోటీలను బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి శనివారం ప్రారంభించారు. పీఆర్‌ బుచ్చి ఓబుళరెడ్డి చారిటబుల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రైతు సంబరాలు నందవరం చౌడేశ్వరి తిరుణాల సందర్భంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతు సంబరాల గురించి ఆయన మాట్లాడుతూ  ఒంగోలు జాతి ఎద్దులు అంతరించిపోకూడదనే ఉద్దేశంతో ఇలాంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సబ్‌ జూనియర్‌ ఎద్దుల పోటీల్లో బహుమతిగా దివంగత  కాటసాని నాగార్జునరెడ్డి జ్ఞాపకార్థం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి,  జయమ్మ దంపతుల ఆధ్వర్యంలో రూ. 2.10 లక్షలు  విజేతలైన ఎ ద్దుల యజమానులకు  బహుమతులుగా ఇచ్చినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ పీఆర్‌ వెంకటేశ్వరరెడ్డి, జిల్లెల్ల శివరామిరెడ్డి, శంకర్‌రెడ్డి, సురే్‌షరెడ్డి, రమణారెడ్డి, దశరథరామిరెడ్డి, చిన్న ఓబుళరెడ్డి, అధికసంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T04:55:11+05:30 IST