
‘‘పిల్లి పాలు తాగుతూ తననెవరూ చూడలేదులే.. అని అనుకుంటుందట’’.. అనేది పాత సామెత. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే పిల్లి చాలా తెలివైనది. దొంగతనంగా పాలు తాగేముందు చాలా ముందు జాగ్రత్తగా ప్రవర్తించింది. కుక్కలు, పిల్లుల చేష్టలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. దాదాపు చాలా మంది ఇళ్లలో కుక్కలు, పిల్లులు ఉండడం సహజమే. రోజూ వాటి అల్లరి చూసి చాలాసార్లు విసుగొచ్చినా.. కొన్నిసార్లు మాత్రం వాటి చేష్టలు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. అందులోనూ పిల్లులు ఒక్కోసారి మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. యజమాని భోజనం చేసే సమయంలో దగ్గరికి వచ్చి.. తనకూ కావాలని అన్నట్లుగా ప్రవర్తించే తీరు, అలాగే కొన్ని పిల్లులు దొంగతనంగా పాలు తాగే తీరు చూడటానికి విచిత్రంగా ఉంటుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో పిల్లి నటన అందరినీ ఆకట్టుకుంటోంది..
ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ పిల్లి వంటింట్లోకి దొంగతనంగా ప్రవేశిస్తుంది. తర్వాత తనకు కావాల్సిన పాలు ఎక్కడున్నాయో వెతుక్కుంటుంది. అయితే గుడ్డిగా వెళ్లి పాలు తాగేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. గ్యాస్ స్టౌవ్ వద్ద నిటారుగా రెండు కాళ్లపై నిల్చుని తేరిపారా చూస్తుంది. అలా చూసే సమయంలో పిల్లి ఎక్స్ప్రెషన్స్ మనుషులను తలదన్నేలా ఉంటాయి. కొద్ది సేపు అలా చూసి.. ఎవరూ లేరని నిర్ధారించుకుంటుంది. తర్వాత మెల్లగా తనకు కావాల్సిన ఆహారం వద్దకు వెళ్తుంది. ఈ ఘటనను మొత్తం దాని యజమాని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వావ్! ఈ పిల్లి ఎంత బాగా యాక్ట్ చేస్తోందో.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి