షాకింగ్ వీడియో: ఎలుగు బంటిని చూడగానే ఆనందంతో దాని వైపే పరుగులు తీసిన చిన్న పాప.. చివరకు..

Published: Sat, 28 May 2022 15:55:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
షాకింగ్ వీడియో: ఎలుగు బంటిని చూడగానే ఆనందంతో దాని వైపే పరుగులు తీసిన చిన్న పాప.. చివరకు..

బుడి బుడి అడుగులు వేసే చిన్న పిల్లలకు ఆటలే ప్రపంచం. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా వారికి ఇష్టమొచ్చిన ఆటలు ఆడుతూ వాటిలోనే లీనమవుతుంటారు. ఇలాంటి సమయాల్లో పెద్దల పర్యవేక్షణ ఉండాలి. లేదంటే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. చిన్నారులు ఆటలు ఆడుతూ అనుకోని ప్రమాదాలకు గురైన సందర్భాలు గతంలో చాలా చూశాం. కొన్నిసార్లు అదృష్టవశాత్తు ప్రమాదాల నుంచి క్షేమంగా బయటపడుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ పాప విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఎలుగుబంటిని చూడగానే చిన్నారి.. ఆనందంతో దాని వైపు పరుగులు తీసింది. చివరకు ఏమైందో మీరే చూడండి..

వాషింగ్టన్‌లోని సియాటిల్‌కు చెందిన ఒక మహిళ.. ఇంటర్నెట్‌లో ‘హీరో మామ్’గా కీర్తించబడుతోంది. రెడ్‌మండ్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఈ మహిళకు జునిపెర్ అనే రెండేళ్ల కుమార్తె ఉంది. ఇటీవల ఓ రోజు మహిళ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా.. చిన్నారి ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. అదే సమయంలో వారి ఇంటి ప్రహరీ మీదికి ఓ చిన్న ఎలుగుబంటి వచ్చింది. దాన్ని చూసిన చిన్నారి.. ఆనందంతో దాని వైపు పరుగెత్తుకుంటూ వెళ్లింది. అయితే ఇంట్లో ఉన్న మహిళకు అనుమానం వచ్చి చూడగా.. అప్పటికే పాప ఎలుగుబంటి దగ్గరకు వెళ్తూ ఉంది. దీంతో వేగంగా వెళ్లిన మహిళ.. కుమార్తెను ఎత్తుకుని అంతే వేగంగా ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఒక్క క్షణం ఆలస్యమైనా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వావ్.. హీరో మామ్.. అంటూ నెటిజన్లు ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

పావురాన్ని వేటాడేందుకు పొంచివున్న పిల్లి.. తీరా దగ్గరికి వెళ్లి.. ఏం చేసిందో మీరే చూడండి...



ఇవి కూడా చదవండిLatest News in Telugu

నలభై ఏళ్ల వయసులో దంపతుల మధ్య గొడవలు.. భర్తపై విరక్తి చెంది రోజూ ఫేస్‌బుక్‌లో సెర్చింగ్... చివరకు యువకుడి పరిచయంతో..పందికొక్కుతో ఫుట్‌బాల్ ఆడుకున్న పెంపుడు కుక్కలు.. తీరా నోటికందే సమయంలో ఊహించని ట్విస్ట్..videoViral Video: 20 నిమిషాల ముందే స్టేషన్ కు చేరిన రైలు.. ప్రయాణికుల రియాక్షన్ చూస్తే.. videoఫోన్ వచ్చిందని రాత్రి బయటకు వెళ్లిన 25 ఏళ్ల కుర్రాడు.. తెల్లారేసరికి రైల్వే బ్రిడ్జ్ కింద శవంగా.. 19 ఏళ్ల ఆ కుర్రాడి పనేనని.. పెళ్లిలో దండలు మార్చుకుంటుండగా అనుకోని ఘటన.. సిగ్గుతో తల తిప్పుకొన్న వధువు.. ఇంతకీ ఏం జరిగిందంటే.. videoటాయిలెట్‍‌లో కూర్చుని ఉండగా... అనుకోకుండా వింత శబ్ధం... ఏంటా అని తిరిగి చూస్తే.. video
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.