భారీ సొరచేప నోరు తెరుచుకుని.. దూసుకొచ్చి కెమెరాను మింగింది.. చివరకు ఏమైందో మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-04-25T02:04:32+05:30 IST

సముద్రంలో సొరచేపలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని సొరచేపలు మనుషులపై దాడి చేసే ఘటనలు కూడా జరిగాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట...

భారీ సొరచేప నోరు తెరుచుకుని.. దూసుకొచ్చి కెమెరాను మింగింది.. చివరకు ఏమైందో మీరే చూడండి..

సముద్రంలో సొరచేపలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని సొరచేపలు మనుషులపై దాడి చేసే ఘటనలు కూడా జరిగాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ భారీ సొరచేప నోరు తెరుచుకుని దూసుకొస్తుంది. పడవపై దాడి చేసే క్రమంలో ఓ కెమెరాను మింగుతుంది. చివరకు ఏమైందో మీరే చూడండి..


ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సముద్రంలో చిన్న చేపల మధ్యన కొన్ని భారీ సొర చేపలు ఈదుతుంటాయి. అదే సమయంలో నీటి పైన ఉండే పడవ మీద దాడి చేసేందుకు ఓ భారీ సొరచేప.. నోరు తెరచుకుని దూసుకొస్తుంది. అయితే పడవ పైన ఉన్న వ్యక్తి.. పైనుంచి ఓ కెమెరాను నీటిలో వేస్తాడు. ఆహారం అనుకున్న సొరచేప.. దాన్ని అమాంతం మింగేస్తుంది. ఈ సమయంలో దాని నోటి లోపలి భాగం మొత్తం కెమెరాలో రికార్డు అవుతుంది. కాసేపటికి దానికి తెలిసిపోయిందో ఏమో.. వెంటనే దాన్ని బయటకు కక్కేస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

పులికి ఎదురుపడ్డ భారీ కొండచిలువ.. ఉన్నట్టుండి రోడ్డుకు అడ్డంగా రావడంతో ఏం జరిగిందో మీరే చూడండి...





Updated Date - 2022-04-25T02:04:32+05:30 IST