అదృష్టమంటే వీడిదే.. అంత పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు.. ఒక్క క్షణం ఆలస్యం అయ్యున్నా..

Published: Thu, 24 Mar 2022 21:12:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అదృష్టమంటే వీడిదే.. అంత పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు.. ఒక్క క్షణం ఆలస్యం అయ్యున్నా..

ప్రమాదాలు చెప్పి రావు. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఎదుటి వ్యక్తుల కారణంగా ప్రమాదాలకు గురవుతూ ఉంటాం. కొందరి నిర్లక్ష్యం ఇంకొందరికి ప్రాణ సంకటంగా మారుతుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూశాం. కొందరు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి చిన్న గాయం కూడా కాకుండా క్షేమంగా బయటపడుతుంటారు. అలాంటి వీడియోలను చూసినప్పుడు.. వీడి టైం చాలా బాగుంది.. అని అనుకుంటూ ఉంటాం. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సైకిల్‌లో వేగంగా వెళ్తున్న బాలుడు.. ఒక్కసారిగా బైకును ఢీకొంటాడు. మరోవైపు వెనుక నుంచి ఓ బస్సు వేగంగా వస్తూ ఉంటుంది. కానీ బాలుడు మాత్రం అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడతాడు.

కేరళ రాష్ట్రం కన్నూరు తాలిపరంబ చోరుక్కల అనే ప్రాంతంలో ఈ నెల 20న ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రధాన రహదారిపై వాహనాలు రద్దీగా తిరుగుతుంటాయి. అదే సమయంలో ఇమ్దాద్‌ అనే ఓ బాలుడు సైకిల్ తొక్కుకుంటూ వేగంగా రోడ్డుపైకి దూసుకొచ్చి ఓ బైకును ఢీకొంటాడు. దీంతో రోడ్డుపై పడిపోతాడు. అయితే వెనుకే కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు వస్తుంది. కిందపడ్డ బాలుడు రోడ్డుపై ఈడ్చుకుంటూ అవతలి పక్కకి వెళ్లిపోతాడు. ఇంతలో బస్సు సైకిల్ పైనుంచి దూసుకెళ్తుంది. దీంతో సైకిల్ నుజ్జునుజ్జవుతుంది. ఒక్క క్షణం ఆలస్యం అయినా  పెద్ద ప్రమాదం జరిగేది. నాలుగో తరగతి చదువుతున్న బాలుడు.. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో అతడి తండ్రి కొత్త సైకిల్ కొనిచ్చినట్లు తెలిసింది. మొత్తానికి బాలుడికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. 

వామ్మో! ఇతనేంటీ చిరుతల మధ్య ఏకంగా కౌగిలించుకుని పడుకున్నాడు.. చూస్తే అవాక్కవుతారు..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

సెకండ్ షోకు వెళ్లిన వైద్యురాలు, ఆమె స్నేహితుడు.. అర్ధరాత్రి ఇంటికి వెళ్లే క్రమంలో ఆటో ఎక్కడంతో.. ఈ విద్యార్థినులంతా కలిసి అందరి ముందే.. బస్సులో చేసిన పని.. చివరికి విషయం బయటికి తెలియడంతో.. videoభర్త దూరమై బాధలో ఉన్న మహిళకు సోదరుడి ఓదార్పు.. ఇద్దరిమధ్య అనూహ్యంగా చిగురించిన ప్రేమ.. ఓ రోజు గ్రామస్తులకు తెలియడంతోనిశ్చితార్థం జరిగిన తర్వాత రద్దయిన పెళ్లి.. అయినా ఆమే భార్యగా కావాలంటూ.. యువకుడు చేసిన పని..ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు.. 9నెలల తర్వాత ఓ రోజు లేఖలో ఇలా రాసి.. ఆమె చేసిన పని.. రన్నింగ్ ఆటో మీదికి వాటర్ బెలూన్ విసిరిన యువకుడు... దీంతో అంతా చూస్తుండగానే క్షణాల వ్యవధిలో..video


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.