వేదిక పైకి పెళ్లికూతురు గ్రాండ్‌ ఎంట్రీ.. అమ్మాయి అంటే ఇలా ఉండాలి..!

ABN , First Publish Date - 2022-05-28T23:18:51+05:30 IST

దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. వివాహ వేడుకలతో ఫంక్షన్‌ హాల్స్‌ సందడిగా మారాయి. పలువురు వినూత్నంగా వివాహాలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మరికొంత మంది పెళ్లి...

వేదిక పైకి పెళ్లికూతురు గ్రాండ్‌ ఎంట్రీ.. అమ్మాయి అంటే ఇలా ఉండాలి..!

దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. వివాహ వేడుకలతో ఫంక్షన్‌ హాల్స్‌ సందడిగా మారాయి. పలువురు వినూత్నంగా వివాహాలు చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. మరికొంత మంది పెళ్లి మంటపాలకు వెరైటీగా వస్తూ ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో వారు ఇలా చేస్తున్నారు. సిగ్గుతో మొగ్గలవాల్సిన వధువులు.. డ్యాన్స్‌లు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఓ పెళ్లికూతురు పెళ్లి మంటపానికి ట్రాక్టర్ నడుపుకొంటూ వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.


జావ్రా గ్రామానికి చెందిన భారతి తద్గేకు ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. పెద్దలు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. ఇరు కుటుంబసభ్యులు కళ్యాణ మండపానికి చేరుకుంటున్నారు. వధువు భారతి కూడా వచ్చింది. కానీ.. నడుచుకుంటూ రాలేదు. అన్నదమ్ములిద్దరూ చెరోపక్క నిల్చొని ఉండగా.. ట్రాక్టర్ నడుపుకొంటూ వచ్చింది. పట్టు చీర, కళ్లద్దాలు ధరించి.. హుందాగా, ఏ మాత్రం భయం లేకుండా ట్రాక్టర్ నడుపుకొంటూ వచ్చిన వధువును చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్న నెటిజన్లు.. అమ్మాయి అంటే ఇలా ఉండాలని కితాబిస్తున్నారు..

పెళ్లిలో దండలు మార్చుకుంటుండగా అనుకోని ఘటన.. సిగ్గుతో తల తిప్పుకొన్న వధువు.. ఇంతకీ ఏం జరిగిందంటే..





Updated Date - 2022-05-28T23:18:51+05:30 IST