దూడను మింగేయాలని కాలును పట్టుకున్న కొండచిలువు.. అయినా లెక్కచేయని లేగదూడ.. చివరకు..

ABN , First Publish Date - 2022-04-29T18:11:06+05:30 IST

కొండచిలువకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అటవీ సమీప గ్రామాల్లోకి చొరబడే కొండచిలువలు ఒక్కోసారి మనుషులు, పశువులపై డాది చేయడం చూస్తూనే ఉంటాం..

దూడను మింగేయాలని కాలును పట్టుకున్న కొండచిలువు.. అయినా లెక్కచేయని లేగదూడ.. చివరకు..

కొండచిలువకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అటవీ సమీప గ్రామాల్లోకి చొరబడే కొండచిలువలు ఒక్కోసారి మనుషులు, పశువులపై డాది చేయడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో వాటి బారి నుంచి కొన్నిసార్లు తప్పించుకున్నా.. అప్పుడప్పుడూ కొన్ని జంతువులు కొండచిలువలకు బలవుతుంటాయి. ఇప్పుడు చూడబోయే వీడియోలో కూడా ఓ కొండచిలువ లేగదూడపై దాడి చేసింది. దాన్ని మింగేయాలని కాలు పట్టుకుని శతవిధాలా ప్రయత్నించింది. అయినా దూడ ఏమాత్రం లెక్కచేయలేదు. చివరకు ఏం జరిగిందంటే..


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. సుమారు 10 అడుగుల కొండచిలువ గ్రామ పరిసరాల్లోకి ప్రవేశిస్తుంది. దూడలు ఉన్న ప్రాంతానికి వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. దాన్ని చూడగానే లేగ దూడలన్నీ పరుగందుకుంటాయి. అయితే వాటిలో ఓ దూడ కాలును పట్టుకుంటుంది. దాన్ని మింగేయాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా ఆ దూడ ఏమాత్రం లెక్కచేయకుండా.. కొండచిలువను ఈడ్చుకుంటూ వెళ్తుంది. అటూఇటూ తిప్పి మరీ కొండచిలువకు చుక్కలు చూపిస్తుంది. చివరకు ఎట్టకేలకు స్థానికుల సాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడుతుంది. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న వారు తమ కెమెరాలో బంధించారు. దీనిపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొండచిలువకే చుక్కలు చూపించిన దూడ.. అంటూ కొందరు అంటుండగా.. కొండచిలువ నుంచి దూడను రక్షించాల్సింది పోయి.. వీడియో తీయడం ఏంటీ.. అని మరికొందరు విమర్శిస్తున్నారు.

 ఫొటోను చూసే అవాక్కవుతున్నారా..? ఈ King Cobra వీడియోను చూస్తే..





Updated Date - 2022-04-29T18:11:06+05:30 IST