Viral Video: నన్ను చూడడం ఆపండి... అంటున్న బుల్లి ఉడత.. ఇంతకీ అది ఏం చేసిందో మీరే చూడండి..

Published: Wed, 29 Jun 2022 20:23:12 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: నన్ను చూడడం ఆపండి... అంటున్న బుల్లి ఉడత.. ఇంతకీ అది ఏం చేసిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలగడంతో పాటూ తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఉడతలకు సంబంధించిన వీడియోలు గతంలో చాలా చూసుంటాం. కానీ ఈ బుల్లి ఉడత చేసిన పని.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నన్ను చూడడం ఆపండి అన్నట్లుగా.. ఆ ఉడత రియాక్షన్ ఇస్తుంది. ఇంతకీ అది ఏం పని చేసిందంటే..

ట్విటర్‌లో వైరల్ అవుతున్న వీడియోలో, ఓ బుల్లి ఉడత ఆహారం కోసం వెతుకుతుంటుంది. దానికి ఓ గోడపై కొన్ని వేరుశెనగ కాయలు కనిపిస్తాయి. ఇంకేముందీ.. చకచకా వాటి వద్దకు వెళ్తుంది. ఓ పెద్ద కాయను నోట్లో పెట్టుకుని పగలగొట్టాలని చూస్తుంది. ఇందుకోసం దాన్ని నోట్లో అటూ ఇటూ తిప్పుతూ.. శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ ఆ కాయ గట్టిగా ఉండడంతో పగలగొట్టడం సాధ్యం కాదు. ఈ క్రమంలో దాని చూపు కెమెరా వైపు పడుతుంది.

 ఈ పిల్ల ఏనుగుకు అతనంటే ఎంత ప్రేమ.. కీపర్‌ను చూడగానే ఏం చేసిందో చూడండి..

కొద్ది సేపు గమనించిన తర్వాత.. ‘‘నన్ను చూడడం ఆపండి.. దిష్టి తగులుతుంది’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. వెంటనే అటువైపు తిరిగి, వేరుశెనగ కాయను మొత్తం నోట్లో పెట్టుకుంటుంది. పక్కకు వెళ్లి తింటే బాగుంటుంది.. అనుకుంటూ మరో కాయను తీసుకుని, అక్కడి నుంచి చకచకా వెళ్లిపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

వావ్! ఈ seal పూలు అందించి.. ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయగానే.. ప్రియురాలి రియాక్షన్ చూడండి..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

కడుపునొప్పి అని కూతుర్ని ఆస్పత్రికి తీసుకెళ్తే గర్భవతి అని చెప్పిన డాక్టర్లు.. ఏం జరిగిందని ఆ తల్లి ఏడుస్తూ అడిగితే..విపరీతంగా మద్యానికి అలవాటు పడిన భార్య.. ఎన్నిసార్లు చెప్పినా మార్పు లేకపోవడంతో ఆ భర్త ఏం చేశాడంటే..Viral Video: ఈ పిల్ల ఏనుగుకు అతనంటే ఎంత ప్రేమ.. కీపర్‌ను చూడగానే ఏం చేసిందో చూడండి..videoViral Video: నడిరోడ్డుపై Dangerous Stunts తో ఓ కుర్రాడి పిచ్చి చేష్టలు.. బైక్‌పై వెళ్తూ సడన్‌గా సీట్‌పై నుంచి పక్కకు దిగి మరీ..videoViral Video: విమానం నుంచి సరస్సుల్లోకి దూకుతున్న చేపలు... ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. videoViral Video: వామ్మో! ఈ బామ్మకు ఏం ధైర్యం.. అంతెత్తు నుంచి అమాంతం దూకేసింది.. ఆశ్యర్యపోతున్న నెటిజన్లు..video
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.