Viral Video: ఆటోలో తీసుకెళ్లాల్సిన లగేజీ.. స్కూటర్‌పై.. తమ్ముడూ! జాగ్రత్త అంటున్న నెటిజన్లు..

Published: Wed, 22 Jun 2022 21:16:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: ఆటోలో తీసుకెళ్లాల్సిన లగేజీ.. స్కూటర్‌పై.. తమ్ముడూ! జాగ్రత్త అంటున్న నెటిజన్లు..

కొందరు తెలిసి చేస్తారో.. తెలీక చేస్తారో.. తెలీదుగానీ చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ అందరి నోళ్లలో నానుతుంటారు. ఇంకొందరు సోషల్ మీడియాలో పాపులర్ కావాలనే ఉద్దేశంతో వినూత్నమైన విన్యాసాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాల బారిన పడుతుంటారు. అయినా మళ్లీ మళ్లీ అదే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి స్కూటర్‌పై పరిమితికి మించిన సరుకులు వేసుకుని, ప్రమాదకర స్థితిలో డ్రైవింగ్ చేయడం... వైరల్‌గా మారింది. తమ్ముడూ! జర జాగ్రత్త అంటూ నెటిజన్లు సూచనలు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ యువకుడు తన స్కూటర్‌పై భారీ ఎత్తున లగేజీ వేసుకుని వెళ్తుంటాడు. ఆటోలో తీసుకెళ్లాల్సిన లగేజీని.. స్కూటర్‌లో ఇరికించి మరీ తీసుకెళ్తుంటాడు. చివరకు తనకు కూర్చోవడానికి స్థలం కూడా ఉండదు. స్కూటర్ చివరన కొంత స్థలంలో కూర్చుని, ముందుకు వంగి.. హ్యాండిల్ పట్టుకుని డ్రైవ్ చేస్తుంటాడు. ఇతన్ని చూసి మిగతా వాహనదారులు షాక్ అయ్యారు. వెనుక వస్తున్న వాహనంలోని ఓ వ్యక్తి... వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. తమ్ముడూ! జాగ్రత్త.. అంటూ కొందరు సలహా ఇస్తుండగా.. మరికొందరు అతడి నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

 వీడేంట్రా.. అంత పెద్ద భవనం పైనుంచి ఇంత ఈజీగా దిగేశాడు.. ఇది రియలా.. లేక గ్రాఫిక్సా..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

రూ.93 కోట్ల ఆస్తికి వారసురాలు.. అయినా రూపాయి కూడా వాడుకోలేని స్థితి.. మరణించేముందు తండ్రి పెట్టిన ఆ ఒక్క కండీషన్‌తో..!ఉన్నట్టుండి చనిపోయిన మహిళ.. ఇంట్లో ఉన్న 20 పెంపుడు పిల్లులకు భోజనం పెట్టే వారే లేక ఆమె మృతదేహాన్నే..9 నెలల గర్భవతి అయిన నా భార్యను కాపాడండి.. తాగడానికి నీళ్లు కూడా లేవంటూ ముఖ్యమంత్రికి మెయిల్ పంపిన భర్త.. చివరకు..videoరూ.28 చిల్లర కోసం గొడవ.. ఆటో వెంట పడుతూ ప్రాణాలు కోల్పోయిన టెకీ.. ఆరేళ్ల తర్వాత రూ.43 లక్షల పరిహారం.. Viral Video: కాలువ దాటేందుకు సాహసం చేసిన యువతి.. పాపం చివరి నిమిషంలో ఊహించని షాక్.. videoViral Video: కుర్చీలో కూర్చున్న వధువు ముందే డాన్స్ వేస్తున్న వరుడు.. చివరకు ఏమైందో మీరే చూడండి..video
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.