Viral Video: వామ్మో! ఈ బామ్మకు ఏం ధైర్యం.. అంతెత్తు నుంచి అమాంతం దూకేసింది.. ఆశ్యర్యపోతున్న నెటిజన్లు..

Published: Tue, 28 Jun 2022 21:27:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: వామ్మో! ఈ బామ్మకు ఏం ధైర్యం.. అంతెత్తు నుంచి అమాంతం దూకేసింది.. ఆశ్యర్యపోతున్న నెటిజన్లు..

రామా.. కృష్ణా.. అనుకుంటూ కాలం వెళ్లదీయాల్సిన వయసులో.. కొందరు అందరినీ ఆశ్చర్యపరుస్తూ వివిధ విన్యాసాలు చేస్తుంటారు. అలాంటి వారిని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఈ వయసులో ఇలాంటి సాహసాలు ఎలా సాధ్యం.. అనే సందేహం కూడా కలుగుతుంది. ఇందుకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ కోవకే చెందుతుంది. 70ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలు ఎత్తైన వంతెన నుంచి నీటిలోకి దూకి.. అందరినీ ఆశ్చర్యపరచింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది..

ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న పవిత్ర గంగా నదిలో స్నానమాచరించేందుకు దేశ నలుమూలల నుండి యాత్రికులు వస్తుంటారు. ఇదిలావుండగా, ఇక్కడి గంగానది వద్ద మంగళవారం స్నానం చేయడానికి వచ్చిన వృద్ధురాలు ఈ సాహసం చేసింది. నదిపై ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై యాత్రికులు గుంపులు గుంపులుగా ఉన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన వృద్ధురాలు బ్రిడ్జి రెయిలింగ్ అవతలికి వెళ్లి నిలబడుతుంది. వృద్ధురాలు ఏం చేస్తుందో అని అంతా ఆసక్తిగా గమనిస్తుంటారు. ఇంతలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. అమాంతం గంగానదిలోకి దూకేస్తుంది.

వావ్! ఈ seal పూలు అందించి.. ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేయగానే.. ప్రియురాలి రియాక్షన్ చూడండి..

దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. నీటి ప్రవాహం ఉన్నా చాకచక్యంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుతుంది. అక్కడే ఉన్న కొందరు యాత్రికులు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ వీడియోపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇలాంటి సాహసాలు చేయడం ప్రమాదకరమని, వృద్ధురాలు ఎవరు, ఎందుకు ఇలా చేసిందనే వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.



ఇవి కూడా చదవండిLatest News in Telugu

కొన్ని నెలల అనంతరం భార్యను చూసేందుకు ఇంటికొచ్చిన భర్త.. తన విషయం బయట చెబితే చంపేస్తానన్న భార్య.. చివరకు ఏం చేసిందంటే.. వేకువజామున అలికిడి రావడంతో పక్క గదిలోకి వెళ్లిన తల్లి.. లోపల ప్రియుడితో కలిసి అసభ్యకర రీతిలో ఉన్న కూతురిని చూసి.. రైల్వే స్టేషన్‌లో కంగారుగా కనిపించిన ఓ బాలిక, ఓ కుర్రాడు.. అనుమానంతో ఆరా తీసిన పోలీసులు.. అసలు నిజం తెలిసి..వాసన వస్తోందేంటని అడిగిన మరిది.. ఎలుక చచ్చిందన్న వదిన.. బాత్రూంలో భర్త శవాన్ని దాచి ఓ భార్య నిర్వాకమిదీ..!రాత్రికి రాత్రే ఇంట్లోంచి అదృశ్యమైన అత్త, అల్లుడు.. కంగారుగా ఊరంతా వెతికిన భార్య.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!యువతులు తోటలో ఉండగా వీడియో తీసిన యువకుడు.. చెల్లెళ్ల వీడియోను డిలీట్ చేయమన్న అన్న.. చివరకు..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.