పందికొక్కుతో ఫుట్‌బాల్ ఆడుకున్న పెంపుడు కుక్కలు.. తీరా నోటికందే సమయంలో ఊహించని ట్విస్ట్..

Published: Fri, 27 May 2022 18:40:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పందికొక్కుతో ఫుట్‌బాల్ ఆడుకున్న పెంపుడు కుక్కలు.. తీరా నోటికందే సమయంలో ఊహించని ట్విస్ట్..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. దేశ విదేశాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా మారుమూల గ్రామాల ప్రజల వరకు వెళ్తున్నాయి. వాటిలో వినూత్నంగా ఉండే వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలైతే నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెంపుడు కుక్కలన్నీ కలిసి పందికొక్కును తినే క్రమంలో ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంటుంది..

న్యూయార్క్‌లోని టాంప్‌కిన్స్ స్క్వేర్ డాగ్ రన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. యజమానులంతా వాటి పెంపుడు కుక్కలను తీసుకుని బయటికి వస్తారు. వాటిని పార్కులో సరదాగా వదిలేస్తారు. అదే సమయంలో అక్కడి ఖాళీ ప్రదేశంలోకి ఓ పందికొక్కు వస్తుంది. దాన్ని చూడగానే కుక్కలన్నీ ఒకేసారి దాని మీద దాడి చేస్తాయి. పందికొక్కును తినే క్రమంలో కుక్కలన్నీ ఒకదానికొకటి పోటీపడతాయి. ఓ కుక్క పందికొక్కును నోటితో పట్టుకుని, మళ్లీ విసిరికొడుతుంది. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం ఏర్పడుతుంది.

20 నిమిషాల ముందే స్టేషన్ కు చేరిన రైలు.. ప్రయాణికుల రియాక్షన్ చూస్తే..

వాటిని గమనించిన యజమానులు.. పరుగు పరుగున అక్కడికి చేరుకుంటారు. పందికొక్కును తినకుండా ఎవరి కుక్కలను వారు అడ్డుకుంటారు. దీంతో పందికొక్కు.. బతుకు జీవుడా.. అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఘటనను మొత్తం అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

 ఈ యువతి అంటే ఏనుగుకు ఎంత కోపం.. ఏం చేసిందో మీరే చూడండి..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఫోన్ వచ్చిందని రాత్రి బయటకు వెళ్లిన 25 ఏళ్ల కుర్రాడు.. తెల్లారేసరికి రైల్వే బ్రిడ్జ్ కింద శవంగా.. 19 ఏళ్ల ఆ కుర్రాడి పనేనని.. పెళ్లిలో దండలు మార్చుకుంటుండగా అనుకోని ఘటన.. సిగ్గుతో తల తిప్పుకొన్న వధువు.. ఇంతకీ ఏం జరిగిందంటే.. videoటాయిలెట్‍‌లో కూర్చుని ఉండగా... అనుకోకుండా వింత శబ్ధం... ఏంటా అని తిరిగి చూస్తే.. videoAmerica లో భర్తకు జాబ్.. ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా కాపురానికి తీసుకెళ్లకపోవడంతో ఆ భార్య అనుమానంతో ఆరా తీస్తే..ఈ దొంగ చాలా విచిత్రంగా ఉన్నాడే.. ఇంట్లో చోరీ చేసి.. చివరగా టీవీపై అతడు రాసిన సందేశం చూసి యజమాని షాక్.. రైల్వే ట్రాక్ పక్కన మూడు ప్లాస్టిక్ బ్యాగుల్లో ఓ మహిళ శరీర భాగాలు.. ఒకే ఒక్క క్లూతో 14 గంటల్లోనే వీడిన మిస్టరీ..!
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.