Viral Video: ఫొటోను చూసే అవాక్కవుతున్నారా..? ఈ King Cobra వీడియోను చూస్తే..

Published: Thu, 28 Apr 2022 08:02:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: ఫొటోను చూసే అవాక్కవుతున్నారా..? ఈ King Cobra వీడియోను చూస్తే..

మామూలు పాములను చూస్తేనే ఆమడ దూరం పరుగెడతాం. అలాంటిది అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను చూస్తే.. అదీ ఒక్కసారిగా దగ్గరగా వస్తే..! ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పడగవిప్పి, కాటేయడానికి సిద్ధంగా ఉన్న కింగ్ కోబ్రా వద్దకు వెళ్లేందుకు ఎవరూ సాహసించరు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కింగ్ కోబ్రాను అంత దగ్గరగా ఫొటో తీసిన వ్యక్తికి ఎంత ధైర్యమో అని అనిపిస్తుంది కదా. ఇక్కడే ఓ ట్విస్టు ఉంది. ఈ వీడియో చూస్తే అది మీకే అర్థమవుతుంది...

పాములంటే ఎంత అసహ్యించుకుంటామో.. చాక్లెట్లు అంటే అంత ఇష్టపడతాం. ఈ రెండింటికీ సంబంధం ఏంటీ.. అని అనుకుంటున్నారా.  అత్యధికులు ఇష్టపడే చాక్లెట్‌ క్రీమ్‌తో.. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా ఓ వ్యక్తికి వచ్చింది. ప్రముఖ స్విస్-ఫ్రెంచ్ చెఫ్ అయిన అమౌరీ గుయిచోన్.. చాక్లెట్‌తో కళాఖండాలను తయారు చేయడంలో సిద్ధహస్తుడు. చాక్లెట్‌తో కింగ్ కోబ్రాను తయారు చేయాలనే వినూత్న ఆలోచనను ఆచరణలో పెట్టాడు. తయారు చేసిన అనంతరం ‘‘చాక్లెట్ కింగ్ కోబ్రా! దీని స్కేల్స్ మాత్రమే నాకు 8 గంటలు పట్టింది." అనే క్యాప్షన్ ఇస్తూ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూస్తుంటే.. చాక్లెట్ తినాలంటేనే భయమేస్తోంది.. అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. కింగ్ కోబ్రాను తలపించేలా చాక్లెట్‌తో తయారు చేయడం అద్భుతం అంటూ మరో వ్యక్తి పేర్కొన్నాడు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

పులికి ఎదురుపడ్డ భారీ కొండచిలువ.. ఉన్నట్టుండి రోడ్డుకు అడ్డంగా రావడంతో ఏం జరిగిందో మీరే చూడండి...



ఇవి కూడా చదవండిLatest News in Telugu

Viral Video: భర్తతో బైక్‌పై వెళ్తుండగా సడన్‌గా కిందపడిన తల్లీకొడుకు.. ఎదురుగా దూసుకొస్తున్న కంటైనర్.. ఒక్క క్షణంలో..videoపెళ్లి వేడుకలో వరుడి ప్రవర్తన చూసి వధువు తండ్రి షాకింగ్ నిర్ణయం.. అదే ముహూర్తానికి కూతురికి వేరే వ్యక్తితో..తన సోషల్ మీడియా అకౌంట్‌లో అసభ్యకర వీడియోలను చూసి ఖంగుతిన్న టీచర్.. దీనిపై ఆరాతీయగా చివరకు ఏం తెలిసిందంటే.. Viral video: ఈ బుడ్డోడు చాలా ఫాస్ట్.. పెళ్లిలోని సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఎలాంటి ఫీట్స్ చేస్తున్నాడో చూడండి..videoనేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేసిన యువకుడు... కొన్ని రోజులకు హత్యకు గురైన ప్రియురాలు, తల్లిదండ్రులు.. అసలు ఏం జరిగిందంటే..మా వదిన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదంటూ పక్కింటోళ్లకు కాల్ చేసి చెప్పాడా వ్యక్తి.. వాళ్లు వెళ్లి చూస్తే..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.