
కొందరు పెంపుడు జంతువులపై అమిత ప్రేమను పెంచుకుంటారు. వాటిని సొంత పిల్లలతో సమానంగా చూసుకుంటుంటారు. ఒక్క రోజు కూడా వాటిని విడిచి ఉండలేరు. ఇంకొందరైతే కుక్కలను ఎంతో ఇష్టంగా చూసుకుంటూ ఉంటారు. వాటి పోషణ విషయంలో ఎంత ఖర్చయినా వెనుకాడరు. స్నానం చేయించడం దగ్గర నుంచి.. ప్రతి విషయంలోనూ సొంత పిల్లల మాదిరి చూసుకుంటూ ఉంటారు. సమయం, సందర్భం చూసుకోకుండా వాటిపై ఎక్కడ లేని ప్రేమను కురిపిస్తుంటారు. వధూవరులు మండపంపై ఉన్న సందర్భంలోనూ వారి పెంపుడు కుక్కను వదల్లేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ వివాహ మండపంలో వేదికపై వధూవరులు డ్యాన్స్ చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఇంతటి ఆనంద క్షణంలోనూ వారు.. పెంపుడు కుక్కను వదల్లేదు. దాన్ని ఎత్తుకుని మరీ డ్యాన్స్ చేయడం మొదలెట్టారు. వధూవరులు కుక్కను మధ్యలో ఉంచుకుని డ్యాన్స్ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. వధూవరులు ఇద్దరూ డ్యాన్స్ చేస్తుంటే.. కుక్క మాత్రం వధువు బుజంపై తల పెట్టి సేద తీరుతూ ఉంటుంది. తర్వాత యజమాని ముఖంపై ముద్దులు కూడా పెడుతుంది. అనంతరం ఇద్దరూ కలిసి.. కుక్కకు ఆప్యాయంగా ముద్దులు పెడతారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు చమత్కరిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి