Viral Video: గడ్డిలో పాకుతున్న పామును నోట కరుచుకున్న గాడిద.. చివరకు ఏమయిందంటే..

ABN , First Publish Date - 2022-01-29T21:41:28+05:30 IST

గాడిద, పాము పోరాటం.. చాలా అరుదుగా జరుగుతుంటుంది. గడ్డి మేసే క్రమంలో ఓ గాడిద.. ఏకంగా పామునే నోటితో పట్టుకోవడం చూడటానికి, వినడానికి వింతగా ఉంటుంది. కానీ, అటువంటి వింతే జరిగింది! గాడిద నుంచి..

Viral Video: గడ్డిలో పాకుతున్న పామును నోట కరుచుకున్న గాడిద.. చివరకు ఏమయిందంటే..

గాడిద, పాము పోరాటం.. చాలా అరుదుగా జరుగుతుంటుంది. గడ్డి మేసే క్రమంలో ఓ గాడిద.. ఏకంగా పామునే నోటితో పట్టుకోవడం చూడటానికి, వినడానికి వింతగా ఉంటుంది. కానీ, అటువంటి వింతే జరిగింది! గాడిద నుంచి విడిపించుకోవడానికి పాము, మరోవైపు వదలకుండా నోటితో గట్టిగా పట్టుకుని ఉన్న గాడిద వీడియో ఇప్పటికే నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పోరాటంలో చివరకు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారో తెలుసుకుందాం పదండి..


రాజస్థాన్‌ ప్రతాప్‌గఢ్ జిల్లా పీపాల్‌ఖుంట్ ప్రాంతంలోని మహి నది ఒడ్డున కొన్ని గాడిదలు గడ్డి మేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ గాడిద గడ్డి మేస్తూపొరపాటున పామును పట్టుకుంది. ఒక్కసారిగా నోటితో పాము మధ్య భాగాన్ని అదిమి పట్టుకుంది. తనను తాను రక్షించుకునే క్రమంలో గాడిద మెడ, దవడ తదితర ప్రాంతాల్లో పాము కాటు వేసింది. అయినా గాడిద మాత్రం దాన్ని అసలు వదల్లేదు. మరింత గట్టిగా నొక్కి పట్టుకుంది. అటూ, ఇటూ తిరుగుతూ విదిలించడంతో చివరకు పాము చనిపోయింది. అయితే పాము విషం కారణంగా కొద్ది సేపటికి గాడిద కూడా చనిపోయింది. రోడ్డు పక్కన మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ వ్యక్తి, దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

ఎలుకపైకి పాము దాడి చేయడం మామూలే.. అదే ఎలుకే పాము మీద దాడి చేస్తే ఎలా ఉంటుందో తెలుసా...





Updated Date - 2022-01-29T21:41:28+05:30 IST