Wedding funny video: కాబోయే భార్య కోసం సాహసం చేసిన వరుడు.. వీడియో చూసి శభాష్ అంటున్న నెటిజన్లు..

Published: Tue, 16 Aug 2022 20:09:57 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Wedding funny video: కాబోయే భార్య కోసం సాహసం చేసిన వరుడు.. వీడియో చూసి శభాష్ అంటున్న నెటిజన్లు..

చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా? చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా?.. అని ప్రేయసి అంటే.. చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే! చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే! అని ప్రియుడు పాట పాడటం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఓ వరుడు.. ఒకడుగు ముందుకేసి, చెట్టులెక్కడంతో పాటూ పొంగి పొర్లుతున్న వరదను కూడా దాటగలను.. అని నిరూపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ (Viral videos) అవుతోంది.

ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తుండడంతో వరదలు పోటెత్తుతున్నాయి. ఈ క్రమంలో అనుకోని ప్రమాదాలు కూడా జరగడం చూస్తూనే ఉన్నాం. అందుకే వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు పదే పదే హెచ్చరిస్తుంటారు. ఇదిలావుండగా, సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్ అవుతోంది. వరద ప్రభావిత ప్రాంతానికి చెందిన వరుడు.. వివాహ దుస్తుల్లో కాబోయే భార్య వద్దకు వెళ్లేందుకు పెద్ద సాహసమే చేశాడు. బంధువులతో పాటూ వధువు ఇంటికి బయలుదేరే క్రమంలో వరద అడ్డుగా వస్తుంది. అయినా లెక్కచేయకుండా దాటేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడు కొంచెం తడబడుతుండగా.. పక్కన ఉన్న మరో వ్యక్తి అతడికి సాయం చేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు (Netizens) ఫన్నీ ఫన్నీగా కామెంట్లు (Funny comments) పెడుతున్నారు.

Funny video: పెళ్లి పీటల మీదే ఇలా ఉంటే.. వివాహానంతరం వీళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో...



ఇవి కూడా చదవండిLatest News in Telugu

husband ఇంట్లో లేడని తెలుసుకుని లోపలికి వెళ్లిన యువకుడు.. చివరకు అటుగా వెళ్తున్న స్థానికులకు అనుమానం రావడంతో..అర్ధరాత్రి girlfriend ఇంటికి వెళ్లిన ప్రియుడు.. యువతి నిద్రలో ఉందని తెలుసుకుని.. చివరకు..Elephant video: హైజంప్ చేసేందుకు ప్రయత్నించిన ఏనుగు.. కుదరకపోవడంతో చివరకు ఇలా కానిచ్చేసింది..videoహోటల్‌లో ఉన్న young woman.. కాసేపటికి కారులో ప్రత్యక్షం.. మనం ఎక్కడికి వెళ్తున్నాం.. అని ప్రియుడిని అడగడంతో.. Shocking incident: జెండా పండుగకు వెళ్లిన పిల్లలు.. వారి కోసం ఎదురు చూస్తున్న తల్లి.. తలుపులు తీసేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా.. Engagement పంక్షన్‌లోకి వచ్చి.. యువకుడి ముక్కు, చెవులు కట్ చేసిన బంధువులు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.