Video Viral: భూమి మీద కాదు.. నీటి లోపల వేటాడే పులిని చూశారా.. చూస్తే వామ్మో ఇదేం పులిరా నాయనా అంటారు..

ABN , First Publish Date - 2022-02-10T00:28:18+05:30 IST

పులులు, సింహాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే చిరుత ఇందుకు పూర్తిగా విరుద్ధం. భూమి మీదే కాదు.. నీటిలో కూడా వేటాడగలను అని నిరూపిస్తోంది.

Video Viral: భూమి మీద కాదు.. నీటి లోపల వేటాడే పులిని చూశారా.. చూస్తే వామ్మో ఇదేం పులిరా నాయనా అంటారు..

చిరుతపులి అనగానే వేటాడే జంతువని టక్కున చెబుతాం. ఒక్కసారి మాటు వేసిందంటే ఎలాంటి జంతువునైనా ఇట్టే మట్టికరిపిస్తుంది. కొన్నిసార్లు అత్యంత వేగంగా దూసుకెళ్తూ జంతువుల మీద పడే చిరుతలను చూస్తే ఆసక్తిగా ఉంటుంది. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను చాలా చూస్తుంటాం. పులులు, సింహాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే చిరుత ఇందుకు పూర్తిగా విరుద్ధం. భూమి మీదే కాదు.. నీటిలో కూడా వేటాడగలను అని నిరూపిస్తోంది. ఇలాంటి చిరుతను చాలా అరుదుగా చూసుంటారు.


ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో నీటి అడుగున వేట కోసం ఓ చిరుత సాహసం చేయడం చూడొచ్చు. చేపలన్నింటినీ ఎంతో చాకచక్కంగా నోట కరుచుకోవడం చూడటానికి ఆశ్చర్యంగా ఉంటుంది. ముందు కొంత తడబడినా చివరికి మరింత గట్టిగా ప్రయత్నం చేసి.. ఎట్టకేలకు చేపలను ఒడిసి పట్టుకుంటుంది. సాధారణంగా భూమి మీద పందులు, మేకలు, జింకలు తదితర జంతువులను వేటాడే చిరుతలనే చూసుంటాం. నీటిలో వేటాడుతున్న ఈ చిరుతను చూస్తే అంతా అవాక్కవ్వాల్సిందే. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ చిరుత చాలా స్పెషల్... అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

లాంగ్‌జంప్‌లో పోటీ పడ్డ గేదె, కుక్క.. చివరికి ఎవరు గెలిచారో తెలుసా..





Updated Date - 2022-02-10T00:28:18+05:30 IST