Monkey shocking: యువకుడి మ్యాజిక్ చూసి అవాక్కయిన కోతి.. చివరకు ఎలా స్పందించిందో తెలుసా..

ABN , First Publish Date - 2022-08-04T02:03:23+05:30 IST

సోషల్ మీడియా (Social media) అందుబాటులోకి వచ్చాక.. వినోదానికి కొదవే లేకుండా పోతోంది. కొన్నిసార్లు వివిధ రకాల వీడియోలు చూపు తిప్పుకోకుండా చేస్తుంటాయి. మరికొన్ని..

Monkey shocking: యువకుడి మ్యాజిక్ చూసి అవాక్కయిన కోతి.. చివరకు ఎలా స్పందించిందో తెలుసా..

సోషల్ మీడియా (Social media) అందుబాటులోకి వచ్చాక.. వినోదానికి కొదవే లేకుండా పోతోంది. కొన్నిసార్లు వివిధ రకాల వీడియోలు చూపు తిప్పుకోకుండా చేస్తుంటాయి. మరికొన్ని వీడియోలు (Videos) ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇక జంతువులకు సంబంధించిన వీడియోలైతే చిన్న పిల్లలతో పాటూ పెద్దలను కూడా తెగ ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరల్ (viral) అవుతోంది. జూలో కోతి (monkey) ముందు ఓ వ్యక్తి మ్యాజిక్ చేస్తాడు. కళ్లప్పగించకుండా చూసిన కోతి.. చివర్లో ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ జూలో (Zoo) కోతి ఎన్‌క్లోజర్ వద్ద ఓ వ్యక్తి మ్యాజిక్ (Magic) చేయడానికి సిద్ధమవుతాడు. ముందుగా ఓ వస్తువును కోతికి చూపిస్తాడు. తర్వాత అరచేయి మూసి, మరుక్షణంలో తెరచి చూపిస్తాడు. అయితే చేతిలోని వస్తువు ఉన్నట్టుండి మాయమవుతుంది. అంతవరకూ అతడి మ్యాజిక్‌ను తదేకంగా గమనిస్తున్న కోతి.. చివర్లో అబ్బా.. మీరు సూపరండి..! అన్నట్లుగా  చప్పట్లు కొట్టి మరీ ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. సర్లే వెళ్లొస్తా.. అంటూ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో అక్కడున్న వారంతా తెగ నవ్వుకుంటారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మ్యాజిక్ అంటే ఈ కోతికి బాగా ఇష్టమున్నట్లుందే.. అంటూ కొందరు, కోతి రియాక్షన్ అద్భుతం.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: పిల్ల ఏనుగును పట్టుకున్న మొసలి.. ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి ఏనుగు.. ఏం చేసిందో చూడండి..





Updated Date - 2022-08-04T02:03:23+05:30 IST