Viral Video: ఈ మొక్కను ముట్టుకుంటే అంతే సంగతులు.. విత్తనాలే తూటాలై ఎలా వస్తున్నాయో చూడండి..!

ABN , First Publish Date - 2022-03-02T23:24:10+05:30 IST

ప్రస్తుతం మనం చూడబోయే మొక్క చాలా ప్రత్యేకమైనది. తన జోలికి వచ్చే శత్రువులపై తూటాలను ప్రయోగిస్తుంది. తన విత్తనాలనే తూటాల్లా ప్రయోగించడాన్ని చూస్తే ఆశ్చర్యం కలగకమానదు..

Viral Video: ఈ మొక్కను ముట్టుకుంటే అంతే సంగతులు.. విత్తనాలే తూటాలై ఎలా వస్తున్నాయో చూడండి..!

తమ జోలికి వచ్చే శత్రువులపై దాడి చేసే మనుషులును చూస్తుంటాం.. అలాగే జంతువులను కూడా చాలా సార్లు చూశాం. ఆత్మరక్షణలో భాగంగా శత్రువులపై దాడి చేయడం సర్వసాధారణమే. అయితే మొక్కలు కూడా ఇలాంటి పని చేస్తాయా అంటే.. అవును అనే చెప్పాల్సి ఉంటుంది. కీటకాలు, దోమలను పట్టుకునే మొక్కలను గతంలో చాలా సార్లు చూశాం. ప్రస్తుతం మనం చూడబోయే మొక్క చాలా ప్రత్యేకమైనది. తన జోలికి వచ్చే శత్రువులపై తూటాలను ప్రయోగిస్తుంది. తన విత్తనాలనే తూటాల్లా ప్రయోగించడాన్ని చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.


బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపించే వుడ్ సోరెల్ అనే మొక్క.. ఈ ప్రత్యేకతలను కలిగి ఉంది. ఈ మొక్క కాయలు చూడ్డానికి అచ్చం బెండకాయల్లా ఉంటాయి. బాగున్నాయే! కోసి కూర వండుకుందాం అనుకుని తాకాలని ప్రయత్నిస్తే... బాంబుల మోత మోగుతుంది. ముట్టుకున్న మరుక్షణమే ఆ కాయ నుంచి విత్తనాలు వేగంగా బయటికి దూసుకొస్తాయి. శతఘ్నులు బాంబులను వదిలినట్లుగా ఈ మొక్క కూడా విత్తనాలను వెదజల్లుతుంది. ఈ విత్తానాలు మనుషులకు హాని చేయకున్నా.. కీటకాలను మాత్రం చావు దెబ్బ కొడతాయి. సుమారు నాలుగు మీటర్ల మేర ఇవి విత్తనాలను వదలగలవు. ఈ మొక్కలు మన దేశంలో కూడా అక్కడక్కడా కనిపిస్తాయి. ఈ మొక్కకు సంబంధించిన వీడియోను ఒడిశాకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా.. తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

మీ అమ్మాయి స్కూల్‌కు రావట్లేదంటూ టీచర్ల ఫిర్యాదు.. తల్లిదండ్రులు నిలదీస్తే ఆ బాలిక చెప్పింది విని..





Updated Date - 2022-03-02T23:24:10+05:30 IST