Shocking Video: షూ వేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి.. లేదంటే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వొచ్చు..

Published: Wed, 10 Aug 2022 21:31:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Shocking Video: షూ వేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి.. లేదంటే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వొచ్చు..

అసాధ్యమనుకున్న సందర్భాల్లో కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకోవడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. కొందరు ఏమరపాటులో ఉంటూ ఊహించని ప్రమాదానికి గురైన సందర్భాలను కూడా తరచూ చూస్తుంటాం. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు (Viral videos) కొడుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. షూ వేసుకునేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తికి.. షాకింగ్ దృశ్యం కనిపించింది. టైం బాగుండడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

Shocking Video: షూ వేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి.. లేదంటే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వొచ్చు..

సోషల్ మీడియాలో (Social media) ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి షూ వేసుకునేందుకు చెప్పుల స్టాండ్ వద్దకు వెళ్తాడు. తీరా షూ బయటికి తీసి, వేసుకునే సమయంలో లోపల చూసి షాక్ అవుతాడు. ఓ నాగుపాము (snake) అందులో పడుకుని తల బయటికి పెట్టి ఉండడంతో ఒక్కసారిగా అతడి మైండ్ బ్లాక్ అవుతుంది. వామ్మో!.. అనుకుంటూ అక్కడి నుంచి పరుగందుకుంటాడు. చివరకు స్నేక్‌ క్యాచర్‌కి సమాచారం అందిస్తారు. అక్కడి వచ్చిన అతను.. ఎంతో చాకచక్యంగా పామును బయటికి తీస్తాడు. లోపల పడుకుని ఉన్న పాము.. ఒక్కసారిగా బుసలు కొడుతూ బయటికి వస్తుంది. అనంతరం దాన్ని పట్టుకుని అడవిలో వదిలేస్తాడు. మొత్తానికి ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Rare operation: కంటి కింద నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. స్కానింగ్ చేసిన వైద్యులకు షాకింగ్ దృశ్యం.. చివరకు..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

love marriage: తన కంటే 12ఏళ్లు చిన్న వయసున్న యువకుడితో ప్రేమ వివాహం.. ఆమె తండ్రి మరణించిన నెల రోజులకు.. ఊహించని ఘటన.. అర్ధరాత్రి.. లైట్ల వెలుగుపడి రోడ్డు పక్కన కనిపించిందో ఆకారం.. అనుమానంతో బస్సును ఆపి ఆ డ్రైవర్ వెళ్లి చూస్తే..Funny video: పెళ్లి పీటల మీదే ఇలా ఉంటే.. వివాహానంతరం వీళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో... videoextramarital affair: ప్రియుడిని రోజూ కలవాలనే ఉద్దేశంతో.. ఇంట్లో పిల్లలు చూస్తుండగా మహిళ చేసిన నిర్వాకం.. Atrocity on girlfriend: రాత్రి వేళ ఇంట్లోకి వచ్చిన ప్రియుడు, అతడి స్నేహితుడు.. కాసేపటికి యువతి కాళ్లు, చేతులు కట్టేసి మరీ.. Suspicious Women: ఆటో కోసం వేచి చూస్తున్న మహిళ.. పోలీసులకు అనుమానం వచ్చి.. ఆమె సూట్‌కేస్‌ను తెరచి చూడగా..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.