Viral Video: ఈ కుక్కది ఎంత మంచి మనసు.. పులి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో చూడండి..

Published: Wed, 18 May 2022 10:20:35 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: ఈ కుక్కది ఎంత మంచి మనసు.. పులి పిల్లల్ని ఎంత బాగా చూసుకుంటుందో చూడండి..

కుక్క కడుపున పంది, పంది కడుపున ఏనుగు.. ఇలా ఒక జంతువుకు ఇంకో జంతువు పుట్టిన ఘటనలు చాలా చూశాం. అలాగే ఒక జంతువు పిల్లలను మరో జంతువు ప్రేమగా చూసుకోవడం కూడా చూస్తుంటాం. అయితే పులి పిల్లలను కుక్క ప్రేమగా చూసుకోవడం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుక్క వద్ద మూడు పులి పిల్లలు ఆడుకుంటూ ఉండటం.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

చైనాలోని ఓ జూలో ఈ ఘటన చోటు చేసుకుంది. పులి ఎన్‌క్లోజర్‌కు సమీపంలో లాబ్రడార్ కుక్క పడుకుని ఉంటుంది. దాని పక్కనే మూడు పులి పిల్లలు అటూఇటూ తిరుగుతూ, కుక్కను ప్రేమగా నిమరడం చేస్తుంటాయి. వాటిని కుక్క తన సొంత పిల్లల్లా చూసుకోవడం అందరినీ ఆకట్టుకుంటుంది. పులి తన పిల్లలకు పాలు ఇచ్చేందుకు నిరాకరించడంతో జూ అధికారులు వాటిని ఆలనాపాలనా చూసుకునే బాధ్యత కుక్కకు అప్పగించారు. ఈ ప్రయత్నం విజయంవంతం అవుతుందో లేదో అనే సందేహంలో ఉన్న అధికారులు, చివరకు అనుకున్నది సాధించారు.

రైలు నుంచి పిల్లలతో పాటూ కిందకు దూకేసిన మహిళ.. సమయానికి కానిస్టేబుల్ గమనించడంతో..

పులి కంటే కుక్కతోనే పిల్లలు బాగా కలిసిపోయాయని చెబుతున్నారు. పులులు కొన్నిసార్లు తమ పిల్లలకు పాలిచ్చేందుకు నిరాకరిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో వాటిని దూరంగా వదిలేస్తుంటాయని అధికారులు తెలిపారు. పులి పిల్లలు కుక్కతో కలిసిపోవడాన్ని జూకు వచ్చే సందర్శకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వావ్! ఈ కుక్క పిల్ల ఎంత బాగా స్కేటింగ్ చేస్తుందో మీరే చూడండి..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

వేర్వేరుగా ఉంటున్న తల్లిదండ్రులను కలపాలని కుమారుడి తపన.. అన్ని ప్రయత్నాలూ విఫలమవడంతో చివరకు అతడు చేసిన పని.. ‘‘నా భార్యకు చీర కట్టుకోవడం రాదు.. కనీసం సరిగా నడవడం కూడా చేతకాదు’’.. అంటూ చివరకు ఆ వ్యక్తి చేసిన పని.. ఈ భార్యాభర్తలిద్దరూ ఐఐటీ టాపర్స్.. America లో కోట్లలో ప్యాకేజీతో జాబ్స్‌కు రాజీనామా చేసి సొంతూరికి తిరిగొచ్చి..చోరీకి గురయిన విగ్రహాలు.. మళ్లీ ఇంట్లో ప్రత్యక్ష్యం.. వాటితోపాటు దొరికిన లేఖలో ఆ దొంగ రాసింది చదివి..పెళ్లయిన మరుసటి రోజే నవ వధువు షాకింగ్ నిర్ణయం.. భర్తకు విడాకులు.. ప్రేమించి పెళ్లి చేసుకుంది కానీ..పొలానికి తుపాకీ తీసుకెళ్లొద్దు.. అని సూచించిన అన్న... మాట్లాడుతుండగానే ఉన్నట్టుండి తమ్ముడు చేసిన నిర్వాకం..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.