Viral Video: ఇదేం ఫీట్‌రా నాయనా! అలా దూకేశావు.. చూస్తుంటేనే భయమేస్తోంది..

ABN , First Publish Date - 2022-01-29T02:12:08+05:30 IST

అందరి నోళ్లలో నానడానికి కొందరు వింత వింత ఫీట్స్ చేస్తుంటారు. కొందరి విన్యాసాలు చూస్తే ఒళ్లు జలదరిస్తుంటుంది. గ్రాఫిక్స్ మాయాజాలమేమో అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వీడియోలు ఇటీవల చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి..

Viral Video: ఇదేం ఫీట్‌రా నాయనా! అలా దూకేశావు.. చూస్తుంటేనే భయమేస్తోంది..

అందరి నోళ్లలో నానడానికి కొందరు వింత వింత ఫీట్స్ చేస్తుంటారు. కొందరి విన్యాసాలు చూస్తే ఒళ్లు జలదరిస్తుంటుంది. గ్రాఫిక్స్ మాయాజాలమేమో అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వీడియోలు ఇటీవల చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ వ్యక్తి చేసిన విన్యాసం.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఓ వ్యక్తి ఒక బిల్డింగ్ మీద నుంచి మరో బిల్డింగ్ పైకి అవలీలగా దూకేసి.. నెట్టింట చక్కర్లు కొడుతున్నాడు. సినిమా సీన్లలో కూడా ఇలాంటి విన్యాసాలు ఉండవేమో అన్నంతగా అందరినీ మైమరిపిస్తున్నాడు.


ఇన్‌స్టాగ్రాంలో వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎత్తైన బిల్డింగ్‌పై ఓ వ్యక్తి సడన్‌గా పరుగెత్తుకుంటూ వస్తాడు. చూస్తుండగానే రెప్పపాటు క్షణంలో అమాంతం ఆ బిల్డింగ్ పైనుంచి ఒక్కాసరిగా దూకేస్తాడు. అలా ఆకాశంలో కొన్ని సెకన్ల పాటు దూసుకెళ్లి.. కొంచెం దూరంలో ఉన్న పక్క బిల్డింగ్‌ పైన ల్యాండ్ అవుతాడు. ల్యాండ్ అయ్యే క్రమంలో పల్టీలు కొట్టడం చూసి కింద పడిపోతాడేమో అన్నంత భయం వేస్తుంది. కానీ సునాయాసంగా ఫీట్ పూర్తి చేసి, విజయ సంకేతం ఇస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరు జాగ్రత్తలు చెబుతుండగా.. మరికొందరు అతడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు.

ఈ అంకుల్ డాల్ఫిన్ డ్యాన్స్.. నభూతో నభవిష్యత్.. చూస్తే మళ్లీ మళ్లీ చూస్తారు..





Updated Date - 2022-01-29T02:12:08+05:30 IST