అంతా చూస్తుండగా.. పెళ్లి మండపంపై వరుడిని కౌగిలించుకున్న యువతి.. చివరలో ట్విస్ట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-01-08T02:13:27+05:30 IST

పెళ్లి వేడుకలో ఒక్కోసారి జరగరాని ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఉన్నట్టుండి పెళ్లికుమారుడు రివర్స్ అవ్వడమో, లేదా పెళ్లి కుమార్తె నచ్చిన వ్యక్తితో వెళ్లిపోవడమో జరుగుతూ ఉంటుంది. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో...

అంతా చూస్తుండగా.. పెళ్లి మండపంపై వరుడిని కౌగిలించుకున్న యువతి.. చివరలో ట్విస్ట్ ఏంటంటే..

పెళ్లి వేడుకలో ఒక్కోసారి జరగరాని ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఉన్నట్టుండి పెళ్లికుమారుడు రివర్స్ అవ్వడమో, లేదా పెళ్లి కుమార్తె నచ్చిన వ్యక్తితో వెళ్లిపోవడమో జరుగుతూ ఉంటుంది. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అంతా చూస్తుండగా పెళ్లి మండపంపై ఓ యువతి చేసిన నిర్వాకానికి అంతా షాక్ అయ్యారు. 


అతిథులు, బంధువులు, సన్నిహితులతో పెళ్లిమండపం కళకళలాడుతోంది. వేదికపై వధూవరులు నిల్చుని ఉండగా.. ఒక్కొక్కరుగా వెళ్లి శుభాకాంక్షలు తెలిపి, ఫొటోలు తీసుకుంటున్నారు. కొందరు వారికి గిఫ్ట్‌లు ఇచ్చి మరీ ఫొటోలు దిగుతున్నారు. ఇలా అంతా సందడి సందడిగా ఉండగా.. ఓ యువతి బురఖా ధరించి స్టేజి పైకి వచ్చింది. ఈమె కూడా అందరి మాదిరే ఫొటో దిగి వెళ్లిపోతుందని అంతా అనుకున్నారు. పైకి వచ్చిన ఆమె ముందుగా వధువుకు గిఫ్ట్ బాక్స్ ఇచ్చింది. 

మండపంలోకి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చిన వధువు.. నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన పాకిస్తానీ పెళ్లికూతురు..


తర్వాత ఒక్కసారిగా వరుడిని గట్టిగా కౌగిలించుకుంది. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. పెళ్లికుమార్తె ఇదంతా చూస్తూ నెమ్మదిగా తల పక్కకు తిప్పుకొంది. అక్కడున్న వారంతా షాక్ నుంచి తేరుకుని.. వారిని వారించే ప్రయత్నం చేసేలోగానే, ఆ యువతి బురఖా తీసింది. ఇంకేముందీ.. ఒక్కసారిగా అంతా మరోసారి షాక్ అయ్యారు. అక్కడున్నది వరుడి స్నేహితుడని తెలుసుకుని అంతా పగలబడి నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పెళ్లి మండపంపై సిద్ధంగా ఉన్న వధువు.. ఇక వరుడు రావడమే ఆలస్యం... అయితే అందుకు విరుద్ధంగా..





Updated Date - 2022-01-08T02:13:27+05:30 IST