వైరస్‌ ముంచేసింది!

ABN , First Publish Date - 2022-06-27T07:45:35+05:30 IST

వైరస్‌ ముంచేసింది!

వైరస్‌ ముంచేసింది!

మిరప పంట తొలగించేసిన రైతు

కోడుమూరు(రూరల్‌), జూన్‌ 26: ఆరుగా లం కష్టపడి పండించిన మిరపకు తెగులు సోకింది. పూత రాలిపోవడంతో వేలాది రూపాయల పెట్టుబడి బూడిదలో పోసిన పన్నీరైంది. దీంతో.. సాగుచేసిన రైతే పంట మొత్తాన్ని దున్నించేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తికి చెందిన కౌలు రైతు ఆంజనేయులు ఎకరా రూ.20 వేల చొప్పున ఆరు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఈ ఏడాది ముందసు ్తగా మూడెకరాల చొప్పున పత్తి, పచ్చి మిరప సాగు చేపట్టాడు. అయితే మిరపకు ఆకుముడత తెగులు సోకింది. దీంతో పంటను రొటావేటర్‌తో దున్నించాడు. రూ.2 లక్షలు నష్టపోయానని ఆయన వాపోయారు.

Updated Date - 2022-06-27T07:45:35+05:30 IST