ప్రజాస్వామ్యంలో ఓటే కీలకమైంది

ABN , First Publish Date - 2022-01-26T07:13:04+05:30 IST

ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా అధికారులతో కలి సి ఓటరు ప్రతిజ్ఞ చేశారు.

ప్రజాస్వామ్యంలో ఓటే కీలకమైంది
కలెక్టరేట్‌లో ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌, అధికారులు

కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ 

జిల్లావ్యాప్తంగా పలుచోట్ల 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 25: ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు ఎంతో కీలకమైందని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా అధికారులతో కలి సి ఓటరు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడు తూ 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ తమ పేరును ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. 16, 17ఏళ్ల మధ్య వయస్సు వారికి ఎలక్ర్టోరల్‌ విషయాలపై అవగాహన కల్పించా లని అధికారులకు సూచించారు. ప్రజాస్వామ్యంలో ప్రతీ పౌరుడు ఓటు హక్కు కలిగి ఉండాలని ఇది ఎంతో కీలకమైందన్నారు. ప్రతీ ఓటరు నిష్పక్షపాతంగా, నిర్భయంగా, కులమతాలకు అతీతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. జాతీయ ఓటరు దినోత్సవం రోజు ప్రధానంగా చేసే అవార్డుకు ఎంపికైన నోడల్‌ అధికారి లక్ష్మణ్‌ను కలెక్టర్‌ అభినందించారు. అయితే ఇదేవిధంగా జిల్లాను మ రింత ప్రగతి పథంలో పయనించేందుకు అధికారులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నటరాజన్‌, ఆర్డీవో రాజేశ్వర్‌, కలెక్టరేట్‌ ఏవో అరవింద్‌కుమార్‌, స్వీప్‌ కోర్‌ కమిటీ సభ్యులు నరేందుల భీంకుమార్‌, రాజేశ్వర్‌, నలంద ప్రియ, స్వాతి, వర్ణ, ఉమాకాంత్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఓటును సద్వినియోగం చేసుకోవాలి : డీఈవో

ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు ఎంతో విలువైందని దీనిని అర్హులైన ప్రతి ఒక్కరూ మంచి నాయకులను ఎన్నుకోవడానికి ఉపయోగించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి టి.ప్రణిత అన్నారు. మంగళవారం పట్టణంలోని గెజిటెడ్‌ నెం.1, బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో కలిసి ఆమె ప్రతిజ్ఞ చేశారు.  ఇందులో సెక్టోరల్‌ అధికారులు సూరజ్‌రావ్‌, మహేందర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు నీలాదేవి, ఉపాధ్యాయులు నంద, మీనాక్షి, సంధ్యారాని, నవీనా, సంధ్యా, సంజయ్‌, హారిచరణ్‌, ప్రశాంత్‌, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

అలాగే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఓటు హక్కు వజ్రాయుధమని తహసీల్దార్‌ సంధ్యారాణి అన్నారు. 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా తాంసి మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల అక్షరాస్యత కార్యక్రమంలో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాటిపెల్లిరాజు, బండల్‌నాగాపూర్‌, సర్పంచ్‌ వెంకన్న, నయాబ్‌ తహసీల్దార్‌ జాదవ్‌విష్ణు, ఆర్‌ఐ మహేందర్‌, నరేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

జైనథ్‌: మండలంలోని ఆయా గ్రామాలతో పాటు మం డల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం ఓటర్ల 12వ జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ బి.మహేంద్రనాథ్‌ రెవెన్యూ సిబ్బందితో ఓటరు ప్రతిజ్ఞను నిర్వహించారు. ఇందులో డిప్యూటీ తహసీల్దార్‌ రాథోడ్‌ రాజేశ్వరి పాల్గొన్నారు.

బేల: తహసీల్దార్‌ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మంగళవారం కార్యాలయంతో పాటు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటరు దినోత్సవం సందర్భం గా ఓటర్లచే ప్రమాణం చేయించారు. ఇందులో తహసీల్దార్‌ రాంరెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

భీంపూర్‌: మండల పరిషత్‌, తహసీల్‌ కార్యాలయంలో  జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఇందులో తహసీల్దార్‌ సోము, ఎంపీడీవో శ్రీనివాస్‌, డీటీ హారిదాస్‌, సీనియర్‌ అసిస్టెంట్‌లు, అబ్దుల్‌హాది, ప్రభు, గంగారెడ్డి, విలాస్‌, ఆర్‌ఐలు అశోక్‌, శారద, తదితరులున్నారు.

గుడిహత్నూర్‌: జాతీయ  ఓటరు దినోత్సవాన్ని మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీ వో కార్యాలయంలో అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. ఎంపీపీ భారత్‌ మాట్లాడుతూ 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నా రు. ఇందులో జడ్పీటీసీ పతంగే బ్రహ్మనంద్‌, ఎంపీడీవో సునీత, ఎంపీవో లింగయ్య, సిబ్బందిపాల్గొన్నారు.

సిరికొండ: మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సర్పరాజ్‌ నవాజ్‌ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకున్నారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించు కుని తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ సిబ్బంది తో కలిసి తహసీల్దార్‌ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నాయబ్‌ తహసీల్దార్‌ శంకర్‌ నాయక్‌, ఆర్‌ఐ యజ్వేందర్‌ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-26T07:13:04+05:30 IST