ఓటర్ల జాబితా పకడ్బందీగా ఉండాలి

ABN , First Publish Date - 2022-08-07T04:55:33+05:30 IST

ఆధార్‌ కార్డుతో ఓటరుకార్డు అనుసంధానం చేశాకైనా అచ్చుతప్పులు, డబుల్‌ ఎంట్రీలు, మరణించిన వారి పేర్లు లేకుండా పకడ్బందీగా రూపొందించాలని పీలేరు నియోజకవర్గ సహాయ ఓటరు నమోదు అధికారి, తహసీల్దారు రవిని వివిధ రాజకీయ పార్టీల ప్రతిని ధులు విజ్ఞప్తి చేశారు.

ఓటర్ల జాబితా పకడ్బందీగా ఉండాలి
తహసీల్దారు రవితో మాట్లాడుతున్న వివిధ పార్టీల ప్రతినిధులు

పీలేరు, ఆగస్టు 6: ఆధార్‌ కార్డుతో ఓటరుకార్డు అనుసంధానం చేశాకైనా  అచ్చుతప్పులు, డబుల్‌ ఎంట్రీలు, మరణించిన వారి పేర్లు లేకుండా పకడ్బందీగా రూపొందించాలని పీలేరు నియోజకవర్గ సహాయ ఓటరు నమోదు అధికారి, తహసీల్దారు రవిని వివిధ రాజకీయ పార్టీల ప్రతిని ధులు విజ్ఞప్తి చేశారు. ఓటరు జాబితా రూపకల్పన, ఆధార్‌ కార్డు అను సంధానం, సవరించిన వివిధ దరఖాస్తులపై రాజకీయ పార్టీల ప్రతినిధు లకు అవగాహన సమావేశం పీలేరు తహసీల్దారు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ ప్రతినిధులు మాట్లాడుతూ ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడడమే కాకుం డా క్షేత్రస్థాయిలో పర్యటించే బీఎల్‌వోలు నిష్పక్షపాతంగా విధులు నిర్వ హించేలా చూడాలని కోరారు. 

సమావేశంపై పార్టీల నిరాసక్తత 

పీలేరులో శనివారం జరిగిన ఓటరు జాబితా-ఎన్నికల సంస్కరణల అవగాహన సమావేశానికి ప్రధాన పార్టీలు నిరాసక్తత కనబరిచాయి. ఓటరు జాబితాకు ఆధార్‌ కార్డు అనుసంధానంతోపాటు సాధారణంగా ఓటరు జాబితా రూపకల్పనలో కీలకంగా ఉండే ఫారం-6, ఫారం-6ఎ, ఫారం-6బి వంటి దరఖాస్తుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల పలు సవరణలు చేసింది. వాటన్నింటినీ రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించాలని జిల్లా, మండలస్థాయి అధికారులను ఆదేశించింది. ఆ ఆదే శాలకు అనుగుణంగా శనివారం పీలేరు తహసీల్దారు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అవగాహన సమావేశం ఏర్పాటు చేయగా పలు పార్టీల నిరాసక్తత చూపాయి. అవగాహన సమావేశం ఉదయం 11 గం టలకు ఉంటుందని తొలుత ప్రకటించిన అధికారులు విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించాల్సి రావడంతో మధ్యాహ్నం 3గంటలకు వాయిదా వేసినట్లు ప్రకటించారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అయిన సమావేశానికి కేవలం వైసీపీకి చెందిన కేవీపల్లె మాజీ జడ్పీటీసీ జయరామచంద్రయ్య ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. దీంతో అధికారు లు వివిధ పార్టీల నాయకులకు పదేపదే ఫోన్లు చేసి గుర్తు చేయాల్సి వచ్చింది. అలా సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో పీలేరు టీడీపీ అధ్యక్షుడు వారణాశి శ్రీకాంత్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు అమరనాథరెడ్డి, సీపీ ఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శి టీఎల్‌ వెంకటేశ్‌ మాత్రమే  హాజర య్యారు. బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అటువైపు కన్నెత్తి చూడలేదు. నియోజకవర్గ స్థాయి సమావేశం కావడంతో ప్రతి మండ లం నుంచి ప్రతినిధులు హాజరవుతారని ఆశించిన అధికారులకు పార్టీల నుంచి లభించిన స్పందన చూసి నిరాశే మిగిలింది. 

Updated Date - 2022-08-07T04:55:33+05:30 IST