నడిగడ్డ సుభిక్షంగా విరాజిల్లాలి

ABN , First Publish Date - 2021-03-01T05:01:50+05:30 IST

గద్వాల కోటలో వెలసిన భూలక్షీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో నడిగడ్డ ప్రాంతం సుభిక్షంగా విరాజిల్లాలని మంత్రా లయం గురురాఘవేంద్ర మఠం పీఠాధిపతి సుబు దేంద్ర తీర్థ శ్రీపాదులు ఆకాంక్షించారు.

నడిగడ్డ సుభిక్షంగా విరాజిల్లాలి
స్వామివారి రథాన్ని లాగుతున్న భక్తులు

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 28 : గద్వాల కోటలో వెలసిన భూలక్షీ చెన్నకేశవ స్వామి ఆశీస్సులతో నడిగడ్డ ప్రాంతం సుభిక్షంగా విరాజిల్లాలని మంత్రా లయం గురురాఘవేంద్ర మఠం పీఠాధిపతి సుబు దేంద్ర తీర్థ శ్రీపాదులు ఆకాంక్షించారు. చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన మహా రథోత్సవాన్ని శనివారం రాత్రి 11 గంటలకు అంగ రంగ వైభవంగా నిర్వహించారు. అంతకుముందు మంత్రాలయం నుంచి గద్వాలకు చేరుకున్న స్వామి వారికి గద్వాల మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, కౌన్సిలర్లు, ఆలయ మేనేజర్‌ ఉదయ్‌, విచారణకర్త ప్రభాకర్‌ రావు, సంప్రతి మోహన్‌, ఆళ్లగడ్డ శ్రీనివాస్‌రావు తదితరులు ఘన స్వాగతం పలికి, మహారథం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ దాదాపు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన భూలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహించే అవకాశం త మ మఠానికి దక్కడం అదృష్టంగా భావిస్తున్నా మ న్నారు. కోటలోని ఆలయాలను దశలవారీగా అభి వృద్ధి చేస్తామన్నారు. మహారథోత్సవాన్ని తిలకించేం దుకు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన రెం డు వేల మందికి పైగా భక్తులు తరలివచ్చారు

Updated Date - 2021-03-01T05:01:50+05:30 IST