Godavari flood: భద్రాచలం వద్ద 47.5 అడుగులకు చేరిన నీటిమట్టం

ABN , First Publish Date - 2022-07-20T13:52:16+05:30 IST

భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నీటిమట్టం 47.5 అడుగులకు చేరింది.

Godavari flood: భద్రాచలం వద్ద 47.5 అడుగులకు చేరిన నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం(Bhadrachalam) వద్ద గోదావరి వరద(Godavari flood) ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం నీటిమట్టం 47.5 అడుగులకు చేరింది. ఔట్ ఫ్లో 11,39,230 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. అయితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ అధికారకంగా ప్రకటన చేయాల్సి ఉంది. నీటిమట్టం 48 అడుగులకు దిగువన తగ్గితే సీ.డబ్ల్యు.సీ నిబంధనల ప్రకారం రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించాల్సి ఉంటుంది. మరోవైపు భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల మండలాలకు రాకపోకలు సాగుతున్నాయి. భద్రాచలం నుంచి కూనవరం ప్రధాన రహదారిపై శబరి నీరు పోటేయడంతో రాకపోకలు నిలిచాయి. 

Updated Date - 2022-07-20T13:52:16+05:30 IST