ఆరోపణల పర్వం

ABN , First Publish Date - 2021-03-07T04:01:04+05:30 IST

పట్టభ ద్రుల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్ర ధాన రాజకీయ పార్టీల నాయకులు పోటాపోటీగా పర్యటిస్తున్నారు.

ఆరోపణల పర్వం

- నాయకుల పర్యటనలతో వేడెక్కిన రాజకీయం

- ముమ్మరంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

నారాయణపేట, మార్చి 6 : పట్టభ ద్రుల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్ర ధాన రాజకీయ పార్టీల నాయకులు పోటాపోటీగా పర్యటిస్తున్నారు. హైదరా బాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎ మ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర ప డుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీ లైన బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ, వామపక్షాల నాయకులు జిల్లాలో పర్యటిస్తున్నారు. నారాయణపేట జిల్లాలో బీ జేపీ అభ్యర్థి రాంచందర్‌ రావును గెలిపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర నాయకు లు నాగూరావు నామాజీ, రతంగ్‌ పాండు రెడ్డి, కొండయ్య, సత్యయాదవ్‌, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ తదితర నాయకులు మక్తల్‌, నారాయణపేటలలో ప్రచారం నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీ దేవిని గెలిపించాలని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైర్‌ప ర్సన్‌ వనజ, ఎమ్మెల్యేలు ఎస్‌ఆర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌ రెడ్డిలతో పాటు ఆ పార్టీ ముఖ్య నాయకులు మక్తల్‌, నారాయణపేట, కోస్గిలలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. మరింత అభివృద్ధి కోసం అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ  అభ్యర్థి చిన్నారెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు వంశీచంద్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షుడు కుం భంశివకుమార్‌రెడ్డి, వాకిటిశ్రీహరి, మాజీ ఎంపీ మల్లురవి, ఒబేదుల్లా కొత్వాల్‌, రాజుల ఆశిరెడ్డి మక్తల్‌, నారాయణపేట, కోస్గిలలో సన్నాహక సమావేశాలు నిర్వ హించారు. నిరుద్యోగులను మోసగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణ పాఠం చెప్పాలని అన్నారు. టీడీపీ అభ్యర్థి ఎల్‌.రమణకు మద్దతుగా ఆ పార్టీ జాతీయ అఽధికార ప్రతినిధి దయాకర్‌రెడ్డి, నాయకులు వినయ్‌మిత్ర, ఓంప్రకా ష్‌, రాఘవచౌద్రి, బీసీ సంఘాల నాయకులు పాండు యాదవ్‌, రామాంజనే యులుగౌడ్‌ ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ నారాయణపేటలో సన్నాహక సమావేశం నిర్వహించారు. నాగేశ్వర్‌కు మద్దతుగా వామపక్ష నాయకులు వెంకట్రాంరెడ్డి, బలరాం, కాశీనాథ్‌, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రచారం నిర్వహిం చారు. అగ్రనాయకులతో పాటు ఎమ్మెల్సీ అభ్యర్థులు జిల్లాలో విస్తృతంగా పర్యటించి నిర్వహించిన సభలు సక్సెస్‌ కావడంతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. 

Updated Date - 2021-03-07T04:01:04+05:30 IST