అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ బడుగుల

Sep 18 2021 @ 01:16AM
సీఎం, మంత్రుల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్న ఎంపీ లింగయ్యయాదవ్‌

సూర్యాపేటటౌన్‌,సె ప్టెంబరు 17 : అన్నివర్గాల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. మద్యం దుకాణాల్లో గౌడ కులస్థులకు 17 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ గౌడ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సీఎం కేసీఆర్‌, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, జగదీష్‌రెడ్డి చిత్రపటాలకు శుక్రవారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, కెక్కిరేణి నాగయ్యగౌడ్‌, బైరు వెంకన్నగౌడ్‌ పాల్గొన్నారు.  


విశ్వానికి ఆదిగురువు విశ్వకర్ముడు 

విశ్వమానవాళికి ఆది గురువు విశ్వకర్మ భగవానుడని బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ సంఘం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణతో కలిసి పాల్గొన్నారు. విశ్వకర్మ చిత్రపటానికి ప్రత్యేకపూజలు చేసి మాట్లాడారు. ప్రపంచంలో మొట్టమొదటి ఇంజనీర్లు విశ్వకర్మలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకారులను ఆదుకునేలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో పాండురంగాచారి, పోలోజు రామాచారి పాల్గొన్నారు.

Follow Us on: