రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-10-01T05:08:18+05:30 IST

రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
సత్తక్కపల్లిలో గోదామును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు

- ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు

మెట్‌పల్లి రూరల్‌, సెప్టెంబరు 30: రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని సత్తక్కపల్లిలో ఎరువులు, విత్తనాల కోసం డీఎమ్‌ఎఫ్‌టీ, సీడీపీ నిధులు రూ. 6.68లక్షలతో నిర్మించిన గోదామును ఎమ్మెల్యే ప్రారంభించారు.  అనంతరం పలు అభివృద్ధి పనుల కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతలు పంట సాగు చేయడానికి పెట్టుబడి కింద రైతు బంధు, పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయకపోయినా మద్దతు ధరతో కొనుగోలు, రైతు మరణిస్తే కుటుంబానికి బీమా కింద రూ. 5లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచులు ఆరేళ్ల లక్ష్మి-రాజగౌడ్‌, పీసు తిరుపతిరెడ్డి, కట్ట శ్రీధర్‌, కోరెపు రవి, పీఎస్‌సీఎస్‌ శంకర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ పోతుగంటి రాజేందర్‌గౌడ్‌, ఉపసర్పంచ్‌ లింగారెడ్డి, ఎంపీటీసీ గంగారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు నల్ల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి గడ్డం రాజారెడ్డి, మెండే రమేష్‌, ప్రతాప్‌రెడ్డి, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-01T05:08:18+05:30 IST